Kolkata law college Student
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Law Student: ‘లా విద్యార్థిని’పై అఘాయిత్యం.. మరో ఘోరం

Law Student: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో  ఆర్‌జీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో గతేడాది జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా, అదే నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఈసారి ఏకంగా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కస్బా ప్రాంతంలో ఉన్న ‘సౌత్ కోల్‌కతా లా కాలేజీ’కి చెందిన విద్యార్థినిపై ఈ ఘోరం జరిగింది. కాలేజీ క్యాంపస్‌లో ఉన్న గార్డ్ రూమ్‌లో కాలేజీ పూర్వ విద్యార్థి మనోజిత్ మిశ్రా (31)తో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు ముగ్గుర్ని పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీశారు. ఈ నెల 25న ఈ ఘటన జరిగిందని, నిందితులు ముగ్గుర్నీ నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించినట్టు అధికారులు తెలిపారు. అత్యాచారాన్ని నిర్ధారించేందుకు ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. బుధవారం రాత్రి 7.30 నుంచి 8.50 గంటల మధ్య అత్యాచారం జరిగిందని తెలిపారు. కాగా, ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. 72 గంటల్లోగా పోలీసు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Read this- Viral News: కోడలి హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. అర్ధరాత్రి గదిలోకి మామ

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ (21)లను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం లా చదువుతున్న విద్యార్థులు కాగా, ప్రధాన నిందితుడు మిశ్రా ‘లా ప్రాక్టీస్’ చేస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీకి రెండవ బాస్ లాంటి అభిషేక్ బెనర్జీతో నిందితుడు శర్మకు సంబంధాలు ఉన్నాయని విపక్ష బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. వారిద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Read this- Rath Yatra: భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు.. విషాదం

అన్నా.. మీ చెల్లి లాంటిదాన్ని..
అత్యాచారం సమయంలో ‘అన్నా.. మీ చెల్లెలు లాంటి దాన్ని. ప్లీజ్ వదిలేయండి’ అని బాధితురాలు వేడుకున్నా నిందితులు కనికరించలేదు.  కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదని తెలుస్తోంది. సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతలు అభిషేక్ బెనర్జీ (ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్య), ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వదిన కజారి బెనర్జీతో (కౌన్సిలర్) పాటు పలువురు ముఖ్యనాయకుల పక్కన ఉన్న ఫొటోలను షేర్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం మరోసారి నిందితుల పక్కన నిలబడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి, పార్టీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. నిందితుడు మనోజిత్ మిశ్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడని అన్నారు. ఆర్జీ కర్ అత్యాచారం అయినా, హత్య కేసైనా బాధితురాలి తల్లిదండ్రులను నోరు మూయించేందుకే సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తారని, లా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడింది ఆ పార్టీ సభ్యుడు కావడంతో ఇప్పుడు కూడా అదే జరుగుతోందని భండారి ఆరోపించారు. బాధితురాలు ఎక్కడ ఉన్నారో చెప్పకుండా దాచిపెడుతున్నారని, తప్పుని కప్పిపుచ్చుకునే కుట్రను జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎందుకింత నిశ్శబ్దం?. ఎవర్ని కాపాడుతున్నారు?. మమతా బెనర్జీ ఆగ్రహం ఇప్పుడేమైంది?’’ అని ప్రశ్నలు సంధించారు. ‘‘ఆర్జీ కర్ ఘటన భయం ఇంకా తగ్గనేలేదు. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి దారుణమైన నేరాలు ప్రతినిత్యం పెరుగుతూనే ఉన్నాయి. మమతా బెనర్జీ పాలన రాష్ట్రంలోని మహిళలకు పీడకలగా మారిపోయింది’’ అని మాల్వియా వ్యాఖ్యానించారు. కాగా, ఈ అత్యాచార ఘటనపై సీఎం మమతా బెనర్జీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, ‘‘ ఈ ఘటన గురించి నేను ఇప్పుడే విన్నాను. విషయం తీవ్రమైనది. కేసు వివరాలు వచ్చిన తర్వాతే నేను మాట్లాడగలను’’ అని సమాధానం ఇచ్చారు.

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు