Cortisol Symptoms (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Cortisol Symptoms: మీలో ఈ సమస్యలు ఉన్నాయా? కార్టిసాల్ హార్మోన్ కంట్రోల్ తప్పినట్లే!

Cortisol Symptoms: కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ గా పిలుస్తుంటారు. శరీరంలో కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు దాని ప్రభావం శరీరంపై ఏదోక రూపంలో కనిపిస్తూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలో లేనప్పుడు ప్రధానంగా ఐదు రకాల సంకేతాలను మన బాడీ తెలియజేస్తుందని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ ఐదు సంకేతాలు ఏవి? నివారణ చర్యలు? ఈ కథనంలో పరిశీలిద్దాం.

అలసట (Fatigue)
సరిపడా విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసిన భావన కలగడం. ఉదయం లేవడం కష్టంగా మారిపోవడం లేదా రోజంతా శక్తి హీనంగా ఉన్నట్లు అనిపించడం.

ఆందోళన (Anxiety)
కార్టికల్ హార్మోన్ నియంత్రణలో లేని వారు.. తరుచూ ఆందోళనకు గురవుతుంటారు. కార్టిసాల్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు మనసు నిరంతరం ‘ఫైట్ లేదా ఫ్లైట్’ స్థితిలో ఉంటుంది. ఇది ఆందోళనను మరింత పెంచుతుంది.

ఏకాగ్రత లోపించడం (Brain Fog)
ఏకాగ్రత కష్టతరంగా మారడం లేదా విషయాలను గుర్తుంచుకోవడంలో సమస్యలు ఎదురవడం. ఇది నిర్ణయాలు తీసుకోవడంలో లేదా స్పష్టంగా ఆలోచించడంలో ఇబ్బందులను కలిగిస్తుంది.

బరువు పెరగడం (Weight Gain)
కార్టిసాల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా మనిషిలో ఆకలి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ మెుత్తంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరుగుతుంటారు.

నిద్ర సమస్యలు (Sleep Disturbances)
రాత్రిపూట నిద్రపోవడంలో ఇబ్బంది లేదా మధ్య రాత్రి 2-4 గంటల మధ్య మేల్కొనడం.. కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలో లేనప్పుడు జరుగుతుంది. అధిక కార్టిసాల్ స్థాయిలు.. నిద్ర చక్రాన్ని భంగపరుస్తాయి.

Also Read: Viral Video: విచిత్ర ప్రమాదం.. రివర్స్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు..!

కారణాలు.. నివారణ చర్యలు?
అధిక కార్టిసాల్ స్థాయిలు.. సాధారణంగా దీర్ఘకాల ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు (కుషింగ్ సిండ్రోమ్ వంటివి) లేదా స్టెరాయిడ్ మందుల వాడకం వల్ల సంభవించవచ్చు. ఈ సమస్యను నియంత్రించడానికి ఒత్తిడిని తగ్గించే అలవాట్లు అవలంబించడం ముఖ్యం. ఇందుకోసం రోజువారీ వ్యాయామం, మైండ్‌ఫుల్‌నెస్ లేదా ధ్యానం, సమతుల ఆహారం (పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 కొవ్వులు), నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. అశ్వగంధ వంటి ఆయుర్వేద ఔషధాలు కూడా కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు, అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.

Also Read This: Drone Thief: లవర్ కోసం వెళ్లిన యువకుడు.. దొంగ అనుకొని తుక్కురేగొట్టిన గ్రామస్తులు!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?