Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: విచిత్ర ప్రమాదం.. రివర్స్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు..!

Viral Video: ఉత్తర్ ప్రదేశ్ లో విచిత్రకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళా లాయర్ తన ఎస్‌యూవీ కారు (SUV Car)ను రివర్స్ చేస్తుండగా ఒక్కసారిగా ఆమె నియంత్రణ కోల్పోయింది. కారు వెనుక వైపునకు వేగంగా దూసుకెళ్లడంతో గాజు గ్లాసుతో ఉన్న హోటల్ ద్వారాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కొందరు తృటిలో తప్పించుకోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారింది.

అసలే జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ బరేలీలోని హోటల్ రమడ (Hotel Ramada) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. హోటల్ ప్రధాన ద్వారం వద్ద పలువురు నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో హోటల్ ముందున్న ఓ కారు.. వేగంగా వెనక్కి దూసుకొచ్చి బలంగా గాజు అద్దాలను ఢీకొట్టింది. అదే వేగంతో హోటల్ లోపలికి దూసుకెళ్లింది. అయితే పలువురు కారు రివర్స్ రావడాన్ని గమనించి.. వెంటనే పక్కకు జరిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఓ మహిళా లాయర్.. కారును రివర్స్ తీసే క్రమంలో నియంత్రణ కోల్పవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read: Drone Thief: లవర్ కోసం వెళ్లిన యువకుడు.. దొంగ అనుకొని తుక్కురేగొట్టిన గ్రామస్తులు!

నెటిజన్ల రియాక్షన్ ఇదే!
జులై 25న రాత్రి 11:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారు రివర్స్ లో హోటల్ రిసెప్షన్ వరకూ దూసుకెళ్లినా కూడా అక్కడ ఉన్న వారు పెద్దగా స్పందిచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తికి ఏమైందోనన్న ఆందోళన అక్కడ నిలబడ్డ వారిలో కనిపించలేదని అంటున్నారు. పైగా హోటల్ గేటు వద్ద కేకుతో నిలబడ్డ వ్యక్తి.. చేతిలో ఉన్నదానిపైనే ఫోకస్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంత ప్రమాదం జరిగినా కూడా పట్టించుకోకుండా ఓ వ్యక్తి కారులో వెళ్లిపోవడాన్ని హైలెట్ చేస్తున్నారు. మెుత్తం యూపీలో జరిగిన ఈ కారు ప్రమాదం నెట్టింట విభిన్నమైన చర్చకు తెరలేపింది.

Also Read This: Weight Loss Tips: అలా ఉన్నవారు.. ఇలా అవ్వాలంటే.. ఈ 5 టిప్స్ ఫాలో కావాల్సిందే!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు