Land Encroachment:
మహబూబాబాద్‌లో భూమి కబ్జా ప్రయత్నం: రైతు జాటోతు బాబురావు ఆవేదన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెల్లికట్టే గ్రామ శివారులోని రెండు ఎకరాల భూమిపై అక్రమ కబ్జా ప్రయత్నం జరుగుతోందని పెద్దమంగ్య తండాకు చెందిన రైతు జాటోతు బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 185/సి/3/2లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌బుక్ కూడా పొందినట్లు ఆయన తెలిపారు. అయితే, అనుమాండ్ల రాంరెడ్డి, బిళ్ళ యాదిరెడ్డి, అలమంచ శ్రీనివాసరెడ్డి, కందుకూరి కృష్ణమూర్తి, శ్రీరామ్ ప్రవీణ్, తుమ్మ శిరీష, రాధ తదితరులు సర్వే నంబర్ 162, 168లో ప్లాట్లు కొనుగోలు చేశామని చెబుతూ తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని ఆయన ఆరోపించారు. జాటోతు బాబురావు తెలిపిన వివరాల ప్రకారం, తన భూమిపై తొర్రూరులో సివిల్ కేసు పెండింగ్‌లో ఉండగానే, ఈ వ్యక్తులు కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. తన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని, న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కోరారు. ఈ ఘటనలో జె. బద్రు, జె. శ్రీను, జె. లచ్చిరాం, జె. నారన్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు ఎస్సై జి. ఉపేందర్ స్పందన:
తొర్రూరు ఎస్సై జి. ఉపేందర్ మాట్లాడుతూ, సర్వే నంబర్ 168లోని భూమిని ప్లాట్లుగా మార్చి, గత ఏడు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ పత్రాలు, నాలా పన్ను పత్రాలు వంటి ఆధారాలు అనుమాండ్ల రాంరెడ్డి తదితరుల వద్ద ఉన్నందున, జాటోతు బాబురావు ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
