Damodar Rajanarsimha(n IMAGEE credit: swetcha reprter)
తెలంగాణ

Damodar Rajanarsimha: జిల్లా ఆస్పత్రుల నుంచే స్క్రీనింగ్ జరగాలి.. వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేపట్టాలి

Damodar Rajanarsimha: క్యాన్సర్ నియంత్రణకు పోరాడాల్సిన అవసరం ఉన్నదని మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) పేర్కొన్నారు.  ఆయన హెల్త్ సెక్రెటరీ, ప్రభుత్వ సలహాదారుడు నోరి దత్తాత్రేయలతో కలిసి వివిధ విభాగాల హెచ్‌వోడీలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2025 సంవత్సరానికి 55 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదన్నారు. క్యాన్సర్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలపై నివేదిక కోరారు.

 Also Read: Sridhar Babu on KTR: కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్.. ఎందుకంటే

ఏయే ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనే దానిపై అధికారులు నోటిఫై చేయాలన్నారు. బాధితుల డేటా స్పష్టంగా ఉండాలన్నారు. వ్యాధి నివారణకు రీసెర్చ్‌లు పెరగాలన్నారు. ఆరోగ్య శ్రీ(Arogya Shri)ద్వారా కూడా వైద్యం అందించాలన్నారు. 90 శాతం క్యాన్సర్ రోగాలు ప్రస్తుతం కవర్ అవుతున్నాయని, పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిమ్స్, ఎంఎన్ జేలో మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. తొలి దశలోనే పాజిటివ్ కేసులను గుర్తించి, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ జరగాలన్నారు. స్టేజ్‌లను బట్టి స్పెషాలిటీ సెంటర్లకు రిఫర్ చేయాలన్నారు. నిమ్స్, ఎంఎన్‌జేలో అందుతున్న సేవలపై ప్రమోషన్ చేయాలన్నారు. ప్రతి మెడికల్ కాలేజీల్లో వర్క్ షాపులు పెట్టాలన్నారు. గ్రామ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

గాంధీ ఆస్పత్రిలో తనిఖీలు
మంత్రి దామోదర రాజనర్సింహా  గాంధీ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోని వార్డులు, విభాగాలు తిరుగుతూ వైద్యసేవలను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరం ఉన్నాయనే అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అనంతరం గాంధీ అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐవీఎఫ్​, ఐయూఎఫ్​ సేవలను బలోపేతం చేయాలన్నారు.

గాంధీ ఆస్పత్రిలోని సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌లతో పాటు ఇతర ఎక్విప్ మెంట్లన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. హెల్త్ ఎక్విప్ మెంట్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలని టీజీఎంఎస్ ఐడీసీ అధికారులకు సూచించారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లన్నీ ఒకే తీరులో ఉండాలని, ఇందుకు ఓ కమిటీ పూర్తి వివరాలను పరిశీలించి, ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలన్నారు. పేషెంట్ల సహాయకుల కోసం కొత్తగా ఐదు అంతస్థుల భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఓపీ, ఐపీ, సర్జరీ, స్పెషాలిటీ సేవల్లో ఎక్కడా లోపం రాకూడదని సూచించారు.

 Also Read: Tummala Nageswara Rao: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలి.. మంత్రి తుమ్మల డిమాండ్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు