Rangareddy district: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్ల దగ్గర దఫాల వారీగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ 2022 – 23 రబీ సీజన్‌లో పండించిన ధాన్యం మిల్లర్లకు అప్పజెప్పగా, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లకు టెండర్ పద్దతిలో ధాన్యం అప్పగించింది. కానీ, రంగారెడ్డి, (Ranga Reddy) మేడ్చల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)ల్లో పాత పద్దతి ద్వారానే బియ్యం తీసుకునేందుకు అంగీకారం చేసుకున్నారు. అయినప్పటికీ రైస్ మిల్లర్ల యాజమాన్యం ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వం అప్పగించిన ధాన్యానికి సరిపడా బియ్యం ఇవ్వకుండా అక్రమంగా విక్రయించుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కలిసి పది రోజుల క్రితం మిల్లర్లపై దాడులు నిర్వహించారు. దీంతో మిల్లర్ల బాగోతం బహిర్గతమైంది.
Also Read: Putin Bodyguards: స్పెషల్ బ్రీఫ్ కేసులో పుతిన్ మలం.. భద్రంగా తీసుకెళ్లిన బాడీగార్డ్స్.. ఎందుకంటే?
ఆకస్మిక తనిఖీలో అక్రమాలు బహిర్గతం
రైస్ మిల్లర్లకు ధాన్యం అప్పగించి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగారెడ్డి జిల్లా(Rangareddy district)లో ఏఏ రైస్ మిల్లర్లకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం అప్పగించారో వివరాలు సేకరించారు. మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి గాను ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం వివరాలతో క్షేత్రస్థాయి పర్యటనలతో దాడులు నిర్వహించారు. దాంతో మిల్లర్లు చేసే అక్రమాలు వెలుగుచూశాయి.
బాధ్యతాయుతంగా ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తే అక్రమ మార్గంలో విక్రయాలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 12 రైస్ మిల్లర్లకు 2022 – 23 రబీ సీజన్‌లో 41,305 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం అప్పగించింది. అందుకు 12,196 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి బియ్యం ప్రభుత్వానికి 2024 మే నెలలో అప్పగించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 8,253 క్వింటాళ్ల బియ్యం 12 రైస్ మిల్లర్ల యాజమాన్యం ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 5,162 క్వింటాళ్ల బియ్యం మాత్రమే అప్పగించారు. మిగిలిన 3,091 క్వింటాళ్ల బియ్యం పెండింగ్‌లోనే ఉన్నది. అమన్‌గల్లు మండలం పోలెపల్లి గ్రామంలోని శ్రీసాయి రామ రైస్ మిల్లు, ఇబ్రహీంపట్నం మండలం బోంగుళూరులోని పవన్ రైస్ ఇండస్ట్రీస్‌లో తనిఖీలు నిర్వహిస్తే షాట్ ఫాల్ ఏర్పడినట్లు తెలిసింది.
అత్యధికంగా ఈ మిల్లులోనే..
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లోని 12 రైస్ మిల్లులకు వరి ధాన్యం సరఫరా చేశారు. 2022 – 23 రబీ సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని అమనగల్లు మండలంలోని శ్రీ లక్ష్మి వెంకటసాయం రైస్ మిల్లు((Rice mill))కు 9,020 క్వింటాళ్ల ధాన్యం, మాడ్గుల మండలం కొల్కోలపల్లిలోని శ్రీ రాఘవేంద్ర రైస్ మిల్లుకు 7,848 క్వింటాళ్లు, మణికంఠ రైస్ మిల్లుకు 6,304 క్వింటాళ్లు, పవన్ రైస్ మిల్లుకు 5,378 క్వింటాళ్లు, జయలక్ష్మి రైస్ మిల్లుకు 4,940 క్వింటాళ్లు, శ్రీ సాయి రామ రైస్ మిల్లు పోలెపల్లికి 3,348 క్వింటాళ్లు, శ్రీ రాఘవేంద్ర చింతపల్లికి 1,578 క్వింటాళ్లు, కనకదుర్గ రైస్ మిల్లుకు 1,423 క్వింటాళ్లు, శ్రీ రామానుంజనేయ రైస్ మిల్లు9(Rice mill))కు 1,280 క్వింటాళ్లు, లక్మి రైస్ మిల్లుకు 67 క్వింటాళ్లు, శ్రీ లక్మి మోడరన్ రైస్ మిల్లుకు 64 క్వింటాళ్లు, సాయి వీరభద్ర రైస్ మిల్లుకు 55 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేశారు.
ఈ ధాన్యం సరఫరాలో 70 శాతం రైస్ ప్రభుత్వానికి మిల్లర్లు అప్పగించాలి. ఏడాది కాలంలోనే క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ఇప్పటి వరకు పూర్తి స్ధాయిలో బియ్యం సరఫరా చేయడంలో మిల్లర్ల యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి 3,092 క్వింటాళ్ల ధాన్యం వివిధ మిల్లుల ద్వారా అప్పగించాల్సి ఉన్నది. కేవలం 5 మిల్లుల ద్వారా పూర్తిస్ధాయిలో బియ్యం అప్పగించారు. ఇంకా 7 మిల్లుల యాజమాన్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది.
అత్యధికంగా పవన్ సాయి రైస్ మిల్లు 1,623 క్వింటాళ్లు, శ్రీసాయి రాం రైస్ మిల్లు(Rice mill)1,339 క్వింటాళ్ల చోప్పున బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పవన్ సాయి రైస్ మిల్లులో ధాన్యం ఉండడంతో క్రమ క్రమంగా ప్రభుత్వానికి అప్పగిస్తానని యాజమాన్యం వివరించింది. కానీ, అమనగల్లు మండలం పోలెపల్లిలోని శ్రీసాయి రాం రైస్ మిల్లులో ధాన్యం లేకపోవడంతో బియ్యం ఇవ్వడం కష్టమని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా యాజమాన్యం సమాధానం సరిగ్గా లేకపోవడంతో కేసు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదేశించారు. ఈ రైస్ మిల్లు యజామాన్యం నుంచి రూ.7.11 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపారు.
కేసు నమోదు
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆదేశం ప్రకారం సంబంధిత రైస్ మిల్లు యజమాన్యంపై కేసు నమోదు చేయించాం. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అప్పగించాం. తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడంలో శ్రీసాయి రామ్ రైస్ మిల్లు యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– గోపికృష్ణ, రంగారెడ్డి జిల్లా సివిల్ కార్పొరేషన్ డీఎం
Also Read:Bayya Sunny Yadav: మరో వివాదంలో భయ్యా సన్నీ యాదవ్.. ఈ దెబ్బతో ఇక ఔటేనా?