Baba Vanga: బాబా వంగా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రోజూ రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంటే.. బాబా వంగా మెరుపులను చూడటంతో తన కంటి చూపును కోల్పోయిందని చెబుతుంటారు. అయితే, ఆమె తన చూపును కోల్పోయిన తర్వాత భవిష్యత్తును చూడగలిగే జ్ఞానదృష్టి పొందింది. ఇక అప్పటి నుంచి ఈమె చెప్పిన జోస్యంలో చాలా వరకు నిజమయ్యాయని చెబుతుంటారు. 2025 ఏడాది గురించి కూడా బాబా వంగా ముందే చెప్పింది. ప్రస్తుతం, ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంటే .. ఆమె చెప్పిన జ్యోతిష్య అంచనాలు గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు భూమి మీద నివసిస్తున్న మానవ జాతికి కొత్త సందేహాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పటికే జరిగిన కొన్ని భయానక సంఘటనలు చూసి ప్రజలు వణికిపోతున్నారు.
Also Read: Indiramma houses: ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.. కాల్వపల్లి గ్రామస్తుల ఆవేదన
రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశంలోనే అతి పెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఎందుకంటే, అంతక ముందు కూడా ఇలాంటివి జరిగినా .. వందల సంఖ్యలో మరణించింది లేదని నిపుణులు అంటున్నారు. వీటికి, బాబా వంగా జోస్యానికి లింక్ పెట్టి ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
Also Read: Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!
2025 ఏడాది మరింత భయానకంగా మారనుందని బాబా వంగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. 2025 సంవత్సరంలో ప్రపంచం అంతమవ్వడానికి ఆరంభ సంకేతాలు కొన్ని జరుగుతాయని బాబా వంగా ముందే వెల్లడించారు. 2012 లో కూడా యుగాంతం వస్తుందని బాబా వంగా చెప్పినప్పటికీ, అది జరగలేదు. ఇదే ఏడాదిలో భారీ యుద్ధాలు, ఘర్షణలు చూస్తామన్న బాబా వంగా .. ప్రస్తుతం, ప్రపంచం భారీ యుద్ధాలను చూస్తోంది. ఇండో – పాక్ మధ్య యుద్దాలు జరుగుతాయని ఆమె ముందే చెప్పింది.
Also Read: Air India flight: మరో ఎయిర్ఇండియా విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్.. చివరికి!
ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు విపరీతంగా పెరిగిపోయి, ప్రపంచ జనాభా పూర్తిగా తగ్గిపోతుందని చెప్పింది. అలాగే, మానవ మనుగడ కోసం కొత్త రకాల పనులు చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితులు ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉంటాయని బాబా వంగ అంచనా వేశారు. వాతావరణ మార్పుల కారణంగా 2170 నాటికి మానవ జీవితం నాశనం పూర్తిగా నాశనం మవుతుందని ఆమె అంచనా వేశారు.