Indiramma houses (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Indiramma houses: ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.. కాల్వపల్లి గ్రామస్తుల ఆవేదన

Indiramma houses: ఆస్తిపాస్తులు ఉండి ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్లు ఇప్పటికే పక్కా ఇండ్లు నిర్మించుకొని ఎంచక్కా కలర్లు వేసుకొని నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు మళ్లీ వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారు. తాటాకు పందిళ్లు, పర్దాలు కట్టుకొని నివాసం ఉంటున్న వాళ్ళను మర్చిపోతున్నారు. అధికారులు గుర్తించి జాబితా తయారు చేసిన గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాత్రం వారికి నచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారని కాల్వపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఆ గ్రామంలో అత్యధికంగా ఇల్లు లేని వారే ఎక్కువగా ఉన్నారు.

తాటాకు పందిళ్లు, పరదాలు కట్టుకున్నోళ్ళని మర్చిపోతున్నారు తాటాకులతో పందిల్లు వేసుకొని కుటుంబమంతా జీవిస్తున్నారు. మరి కొంతమంది ఉన్న ఇండ్లపై వర్షం కురవకుండా ఎండ కొట్టకుండా చలి వేయకుండా పరదాలు కప్పుకుని నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళందరూ ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు అధికారులకు ఇచ్చారు. తొలుత ఇందిరమ్మ అర్హులుగా నిర్ధారించిన వాళ్లే మాకు ఇండ్లు రాకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కాగా ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికే మళ్లీ ఇండ్లు కేటాయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కార్యదర్శులు అడిగితే నాదేం లేదమ్మా అంతా కమిటీలదే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాదేం లేదమ్మా అంతా కమిటీలదే

గ్రామాల్లో పరిపాలన అధికారులుగా ఉన్న కార్యదర్శులను తమకు ఇండ్లు రాలేదేమో అని అడిగితే నాదేం లేదమ్మా అంత ఇందిరమ్మ కమిటీల బాధ్యులదేనని అంటున్నారని కాల్వపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలను మరచి కమిటీల బాధ్యుల సమీప బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయిస్తున్నారని వాపోతున్నారు. ఇందిరమ్మ కమిటీల వల్ల తమకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Israel Iran War: అర్ధరాత్రి భీకర యుద్ధం.. దూసుకొచ్చిన 100 మిసైళ్లు.. పరుగులు పెట్టిన జనం

ఎన్నికల్లో సీతక్కను ఆదరించాం ఓట్లు వేశాం

2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క మళ్లీ పోటీ చేసిన సమయంలో తాము సీతక్కను ఆదరించి ఓట్లు వేశామని కాల్వపల్లి గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. తమ సమీప బంధువులు వచ్చి టిఆర్ఎస్ కు ఓటు వేయాలని డిమాండ్ చేసి, అత్యధికంగా డబ్బులు ఇస్తామన్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సీతక్కకి ఓటు వేస్తే మాకు ఏం లాభం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలమైన మాకు ఇండ్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీ బాధ్యతలు చేస్తుంటే ఎమ్మెల్యేగా సీతక్క ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. గ్రామస్థాయిలో జరుగుతున్న అన్యాయాలను మంత్రి సీతక్క తెలుసుకొని బాధితులకు సరైన న్యాయం చేస్తూ ఆదరించాలని కోరుతున్నారు.

మాకు ఇల్లు జాగా ఇవ్వాలి.. ఇండ్లు కట్టివ్వాలి

గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బడే నాగజ్యోతికి ఓటు వేయాలని ఓటుకు దాదాపు 1000 చొప్పున ఇచ్చేందుకు ముందుకు వచ్చారని అయితే వారి మాట కాదని స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కను మళ్ళీ గెలిపించుకుంటే మంత్రిగా అయ్యి తమకు చేదోడు వాదోడుగా ఉండి కష్టాలను తీర్చుతుందనుకుంటే అప్పటి కష్టాలు నేటికీ తీరేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కమిటీల ద్వారా దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొంటున్న సమస్యలపై దృష్టి సారించి మాలాంటి నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది వర్షాకాలంలో మా ఇండ్లని కొట్టుకపోయాయని ఒకవైపు ఒర్రె, మరోవైపు వాగు ద్వారా వచ్చే వరద నీటికి తమ ఇల్లు మొత్తం మునిగిపోయి ఇబ్బందులు పడ్డామని అలాంటి మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా బిల్డింగులు ఉన్నోళ్లకు, కార్యకర్తలకు ఇస్తారా అంటూ మండిపడుతున్నారు.

Also Read: GHMC and HMDA: గ్రేటర్‌లో 24 లక్షల.. మొక్కలు నాటడమే లక్ష్యం!

మంత్రి పొంగిలేటికి ఇందిరమ్మ ఇండ్ల నిరసన సెగ

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను నిర్వహించిన సమయంలో జాబితా తయారు చేసేటప్పుడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు సంబంధించిన విషయంలో నిరసన సెగ తగిలింది. ఏప్రిల్ 29న పాలేరు నియోజకవర్గంలోని ముదిగొండ మండలం వనం వారి కిష్టాపురం గ్రామంలో పంచాయతీకి తాళం వేసి గ్రామస్తులు ఆందోళన చేశారు. అదేవిధంగా ముదిగొండ మండలం పండ్రేగులపల్లి చెందిన కోట ఉమారాణి తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఏప్రిల్ 30న పాలేరు నియోజకవర్గంలో ముదిగొండ మండలానికి చెందిన దివ్యాంగులకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు రాలేదని ఎంపీడీవో కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళన చేశారు.

నిరుపేదల పేర్లు కనిపించకుండా చేశారు

మే 5న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేశారని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రేకులు, గుడిసెలు ఉన్నవారికి కాకుండా బిల్డింగులు, భవనాలు ఉన్నవారికి కేటాయించారని ఆందోళన చేశారు. కోనాయి గూడెం లోను ఇందిరమ్మ ఎంపికలు జరిగాయని, అర్హులకు, నిరుపేదల పేర్లు కనిపించకుండా చేశారని ఆందోళన చేశారు. తొలుత అర్హులైన ఇందిరమ్మ జాబితాలో ఉన్న వారిని అనాలోచిత కారణంగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నాయకులు సైతం ముదిగొండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ఆందోళన చేశారు. జూన్ 2న నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య వ్యక్తం చేయగా గాయాలయ్యాయి. గత సోమవారం నేలకొండపల్లి మండలం రాయి గూడెంలో ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకులు జరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ

ఈనెల 10న స్వేచ్ఛ లో “అర్హులైన… ఆవేదనే” శీర్షికన ఇండ్లు రాని అభాగ్యుల పక్షాన వార్త ప్రచురితమైంది. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై పాలకుర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని జనసేన ఇన్చార్జి నగేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో ఫతేపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. అంతేకాకుండా పాలకుర్తి నియోజకవర్గంలోని పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డికి సైతం లబ్ధిదారుల నుంచి నిరసన సెగ తగలడంతో అక్కడి నుంచి ఉడాయించారు. తాజాగా ములుగు నియోజకవర్గంలో తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలంతా ఒక్కటై తమకు ఇందిరమ్మ ఇండ్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్కను తాము ఓట్లు వేసి గెలిపిస్తే మమ్మల్ని మర్చిపోతున్నారని మండిపడుతున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీల సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు.

Also Read: ISRO – Ax-4 Mission: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. డేట్ ఫిక్స్ చేసిన ఇస్రో.. ఎప్పుడంటే?

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?