Israel Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మద్య యుద్ధం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. ఎవరూ ఊహించని విధంగా ప్రతిస్పందనకు దిగింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ చేపట్టిన దాడుల్లో టెల్ అవీవ్, జెరూసలెంలో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
బాంబుల మోతతో దద్దరిల్లిన నగరం
ఇరాన్ ప్రధానంగా టెల్ అవీవ్ (Tel Aviv) నగరాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. శత్రుదేశం ప్రయోగించిన మిసైళ్లు నగరాన్ని కుదిపేశాయని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. సైరన్ల శబ్దం నగరమంతటా వినిపించిందని.. టెల్ అవీవ్ లోని కీలక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది. మరోవైపు టెల్ అవీవ్ లోని కీలక ప్రాంతాల వైపునకు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. వాటిని గగనతంలోనే అడ్డుకునేందుకు ఇంటర్ సెప్టార్ క్షిపణులను ప్రయోగించినట్లు స్పష్టం చేసింది.
If Iran attacks Israel today, I'll give 100$ to everyone who likes this tweet.#Isreal | #Iran | WWIII pic.twitter.com/NBYWPysoU2
— blesha (@blesha_bs) June 13, 2025
If Israel launches another attack on Iran in the next hours, I'll give 100$ to everyone who likes this tweet.#Isreal | #Iran | WWIII pic.twitter.com/2awqmMl6z5
— ° (@_2BLEA__) June 13, 2025
100పైగా మిసైళ్లు ప్రయోగం
టెల్ అవీవ్ లోని బహుళ అంతస్తుల భవనాలను ఇరాన్ మిసైళ్లు ఢీకొట్టిన దృశ్యాలు అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి. ఈ దాడుల్లో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. పలు భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. 100కు పైగా దొసుకొచ్చిన డ్రోన్లు, మిసైళ్లలో చాలా వాటిని తమ గగనతల వ్యవస్థ కుప్పకూల్చాయని సైన్యం వెల్లడించింది. అయితే వాటిలో కొన్ని రక్షణ వ్యవస్థను అధిగమించి.. నగరాలవైపునకు చొచ్చుకు వచ్చాయని అంగీకరించింది. మరోవైపు ఇందుకు ప్రతీగా ఇజ్రాయెల్ సైతం శనివారం ఇరాన్ పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని మెహ్రాబాద్ ఎయిర్ పోర్ట్ (Mehrabad International Airport) తగలబడింది. ఇది ఇరాన్ సైనిక, సివిల్ కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Live:
Iran counter attack on Isreal.#isreal #iran #iranisrealwar pic.twitter.com/oavx1w3NOC— Mr Zar (@Itszar99) June 13, 2025
అణుస్థావరాలపై దాడి
అంతకుముందు ఇజ్రాయెల్.. ఇరాన్ దేశంపై భారీ ఎత్తున దాడులకు దిగింది. అణు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు స్పష్టం చేసింది. ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై కూడా దాడి చేసినట్లు కూడా తెలిపింది. ఈ దాడుల్లో యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్స్, ఇతర మౌలిక సదుపాయాలు నాశనమైనట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఆరుగురు టాప్ మిలటరీ కమాండర్స్, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డెఫ్రిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.