Manchu Lakshmi on Air India Plane Crash
ఎంటర్‌టైన్మెంట్

Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా‌ ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!

Manchu Lakshmi: ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోవడం అనేది అత్యంత బాధాకరం. గుజరాత్‌, అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైన (Air India Plane Crash) ఘటనలో దాదాపు 274 మంది మృతి చెందారు. వారందరికీ ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియదు. ఇందులో ప్రయాణికులు, సిబ్బందే కాకుండా, ఆ విమానం పడిన హాస్టల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఎప్పటిలానే భోజనం చేస్తున్న వారిపై విమానం పడుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మంచు మోహన్ బాబు తనయ, మంచు లక్ష్మీ విడుదల చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. కారణం అదేరోజు మంచు లక్ష్మి ఎయిరిండియా విమానంలోనే తన కుమార్తెతో కలిసి లండన్‌ వెళ్లారట. లండన్‌లో ఆమె ల్యాండ్ అయిన తర్వాత అహ్మదాబాద్ ఘటన తనకు తెలిసి షాకయ్యానని ఆమె ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. లండన్‌లో దిగిన తనకు వరసగా మెసేజ్‌లు రావడం చూసి ఫోన్ ఆన్ చేస్తే.. అందరూ మీరు ఎలా ఉన్నారు? అంటూ అడుగుతున్నారని, అప్పుడు అసలు విషయం తెలిసిందని ఆమె వెల్లడించారు.

Also Read- Kavya Kalyanram: కావ్య క‌ళ్యాణ్ రామ్ కొత్త ఫొటోలొచ్చాయ్.. సోషల్ మీడియా షేక్!

ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఎలా ఉన్నానో అని నాకు ఎన్నో ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. నేను, మా అమ్మాయి ఘటన జరిగిన రోజు ముంబై నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో వెళ్లాము. దేవుడి దయతో మేము సేఫ్‌గానే చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఈ ప్రమాదం గురించి తెలిసి షాకయ్యాను. ఈ ప్రమాదంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇందులో విద్యార్థులు కూడా మృతిచెందారని తెలిసి నిజంగా నా హృదయం ముక్కలైంది. ఈ ఘటనతో జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే విషయం మరోసారి వెల్లడైంది. మన ప్రాణాలు ముగిసిపోవడానికి క్షణం చాలనేదానికి ఈ ప్రమాదమే ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) తన బాధను వ్యక్తం చేశారు.

Also Read- Naga Chaitanya: సమంత, శోభితలతో నాగ చైతన్య రొమాన్స్? బయటపడ్డ టాప్ సీక్రెట్?

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలు దేరిన ఈ ఎయిరిండియా విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది స్టాఫ్ ఉండగా.. ఈ దుర్ఘటన జరిగిన ప్రదేశంలోని విద్యార్థులు కొందరు చనిపోయారు. ప్రస్తుతం మృతుల సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ ఘటనలో రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రముఖులెందరో విచారం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తును చేపట్టింది. ఇప్పటికే అతి ముఖ్యమైన బ్లాక్ బాక్స్‌ లభించగా, బ్లాక్ బాక్స్ నుండి డేటాను సంగ్రహించే పనిలో ఉన్నారు. డేటా వచ్చిన తర్వాత ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేది తెలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు