Health Tips: నీరు మన శరీరానికి అతి ముఖ్యమైనది. చాలా మంది ఈ ఊరుకుల పరుగుల జీవితంలో నీళ్ళు కూడా సరిగా తాగరు. మనం భోజనం సమయానికి చేయకపోయినా నీళ్ళు తాగితే ఆకలిగా అనిపించదు. శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అయితే నీరు తాగే విధానం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఒకేసారి గ్లాసుల మీద గ్లాసులు గడగడా తాగేస్తారు. మరికొందరు నిలబడి నీరు తాగడం అలవాటు చేసుకుంటారు. అయితే, వైద్యులు ఇది మంచి పద్ధతి కాదని తేల్చి చెప్పారు. ఇవి రెండూ శరీరానికి హానికరం. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వలన గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. నిలబడి నీరు తాగడం వలన మోకాళ్లపై ప్రభావం చూపి జాయింట్ సమస్యలకు కారణం అవుతుంది. వేగంగా తాగడం వలన నీరు నేరుగా అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరి జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తుంది. అయితే, నీరు ఎలా తాగాలో ఇక్కడ తెలుసుకుందాం..
కూర్చొని తాగండి: ఇది శరీరానికి సమతుల్యతను ఇస్తుంది.
నెమ్మదిగా తాగండి: నీరు శరీరంలోని అవయవాలకు సమానంగా చేరుతుంది.
చిన్న చిన్న మోతాదుల్లో తాగండి: ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒక గ్లాసు నీరు తాగడం సరైన పద్ధతి.
ఉదయం లేవగానే నీరు తాగండి: ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
Also Read: Chicken: చికెన్‌లో వాటిని తినకూడదని తెలుసా.. తింటే, మీ పని గోవిందా..?
నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్తాయి.
2. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
3. చర్మం మెరిసిపోతుంది.
4. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
5. గుండె, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగవుతుంది.
Also Read: Slap Your Coworker Day: మీ తోటి ఉద్యోగి చెంప చెళ్లుమనిపించాలా? ఇదే సరైన రోజు.. ఎందుకంటే?
జాగ్రత్తలు
1. చల్లని నీరు ఎక్కువగా తాగవద్దు.
2. భోజనం చేసిన వెంటనే నీరు తాగకండి.
3. గడగడా తాగే అలవాటు మానేయండి.
