Slap Your Coworker Day: అక్టోబర్ 23న ప్రతి ఏడాది నేషనల్ స్లాప్ యువర్ కోవర్కర్ డే (National Slap Your Coworker Day)ను జరుపుకుంటారు. మనం ఆఫీసులో మన తోటి వర్కర్స్ తో బ్రేక్ టైం లో జోక్స్ వేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తాము. ఇదొక హాస్యాస్పదమైన, ఆన్-అఫీషియల్ హాలిడే. అయితే, ఇది నిజంగా “స్లాప్” (చెంప చెళ్లుమనిపించడం ) గురించి కాదు. అది కేవలం ఆఫీస్ టెన్షన్ నుంచి బయట పడటానికి చేసుకునే ఒక ఫన్నీ ఫెస్టివల్ మాత్రమే. ఈ రోజున మీరు ఇబ్బంది పడే కోలీగ్ (co-worker) గురించి జోకులు చెప్పుకోవడం, మీమ్స్ షేర్ చేయడం, టీమ్ బాండింగ్ గేమ్స్ ఆడడం వంటివి జరుపుకుంటారు.
దీని వలన కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు (Surprising Benefits)
ఈ డే కేవలం ఫన్ కోసమే కాదు, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిజంగా మీ ఫ్రెండ్స్ ను చెంప చెల్లు మనిపించేలా చేయకుండా.. ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోండి.
స్ట్రెస్ రిలీఫ్ (Stress Relief): ఆఫీస్‌లో ఇబ్బంది పడే కోలీగ్స్ గురించి జోకులు చెప్పడం వలన వెంటనే ఫ్రస్ట్రేషన్‌ను వస్తుంది. ఇది కాథార్సిస్ (cathartic) అనే మానసిక ప్రయోజనాన్ని ఇస్తుంది. దీని వలన రోజువారీ టెన్షన్ కూడా తగ్గుతుంది.
టీమ్ బాండింగ్ : హాస్యంగా ఫ్రస్ట్రేషన్స్ షేర్ చేయడం వల్ల కోలీగ్స్ మధ్య బాండ్ బలపడుతుంది. ఇది వర్క్‌ప్లేస్ మూడ్ ను ను కూడా మారుస్తుంది. అంతే కాదు, ఇది పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.
Also Read: Gold Rate Prediction: గోల్డ్ ధరలు ఇక తగ్గే అవకాశం లేదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
హ్యూమర్ & పాజిటివ్ వైబ్స్ : ఈ రోజు మీమ్స్, జోకులు పోస్ట్ చేయడం ద్వారా ఆఫీస్ మోనోటనీను బ్రేక్ చేస్తుంది. సైకాలజికల్ గా, లాఫ్టర్ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసి, మూడ్‌ను కూడా బూస్ట్ చేస్తుంది.
క్రియేటివ్ సెలబ్రేషన్స్ : నిజమైన స్లాప్ చేయడం బదులు, ఫన్ యాక్టివిటీస్ చేయవచ్చు. “స్లాప్” గేమ్స్ , కామెడీ స్కిట్స్, లేదా వర్చువల్ మీమ్ కాన్‌టెస్ట్ ఇలాంటివి టీమ్‌ను ఎంగేజ్ చేస్తుంది.
దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే?
జోకులు & మీమ్స్: సోషల్ మీడియాలో “స్లాప్” జోకులు పోస్ట్ చేయండి.. కానీ, ఇక్కడ ఎవర్ని టార్గెట్ చేయకండి.
ఆఫీస్ ఫన్: టీమ్ మెంబర్స్ తో ఒక మీటింగ్ పెట్టి హాస్యాస్పదమైన “ఫ్రస్ట్రేషన్ షేరింగ్” సెషన్ ఒకటి ఏర్పాటు చేయండి.
ఫన్ : ఇది జస్ట్ ఫర్ లాఫ్స్ కోసం మాత్రమే.
