Thati Kallu ( Image Source: Twitter)
Viral

Thati Kallu: క‌ల్లులో ఆల్క‌హాల్ ఎంత శాతం ఉంటుంది..? మ‌త్తు రావడానికి ఏమైనా క‌లుపుతారా..?

Thati Kallu: కల్లు తాగితే మత్తు ఎక్కుతుందని అందరికీ తెలుసు. కానీ ఈ మత్తు నార్మల్ గా వస్తుందా లేక కల్తీతో వస్తుందా? అసలు కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? కాదా అనే ముఖ్యమైన విషయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

సాధరణంగా కల్లు మూడు రకాల చెట్ల నుండి వస్తుంది. తాటి, ఈత, కొబ్బరి.. ఈ చెట్ల నుండి సేకరించే తీపి రసాన్ని నీరా అంటారు. ఈ నీరాను చాలా మంది ఎనర్జీ డ్రింక్‌గా తీసుకుంటారు. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. B1, B2, B12, C విటమిన్లు, పొటాషియం, ఐరన్, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి.

Also Read: Samantha: మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్న సమంత.. ఈ సారి గెలుస్తుందా లేక గెలిపిస్తుందా?

అంతే కాదు, ప్రోబయోటిక్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ సమృద్ధిగా ఉంటాయి. నీరా పులిసినప్పుడు (ఫెర్మెంటేషన్) అది కల్లుగా మారుతుంది. ఈ ప్రక్రియలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తాయి. కల్లులో 4-8% ఇథనాల్ ఉంటుంది, ఇది మత్తును కలిగిస్తుంది. పులియడం కోసం ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే, ఆల్కహాల్ శాతం అంత ఎక్కువగా ఉంటుంది.

Also Read: Nitish Reddy: సిరీస్ మధ్యలోనే నితీష్ కుమార్ రెడ్డి తిరుగుపయనం.. బీసీసీఐ కీలక ప్రకటన

చెట్ల నుంచి తీసిన రసాన్ని గంటలోపు తాగితే నీరా తీపిగా, మత్తు లేకుండా ఉంటుంది. కానీ, 5 నుంచి 6 గంటల తర్వాత అది కల్లుగా రూపాంతరం చెంది.. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో అమ్మే కల్లు 100% స్వచ్ఛమైనదని భావించడం కష్టం. కొందరు వ్యాపారులు కల్లును నీళ్లతో కల్తీ చేసి, మత్తును పెంచడానికి మత్తు బిళ్ళలను వాడుతుంటారు. ఒకసారి వీటిని కలిపాక .. దానిలో మత్తు శాతం పెరిగిపోతుంది. వీటి పని ఏంటంటే.. కల్లు తాగడాన్ని వ్యసనంగా మార్చి, కాలేయాన్ని దెబ్బ తినేలా చేస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే, ఆరోగ్యం కాపాడుకోవాలంటే నీరా తాగడం ఉత్తమం. బెంగళూరు, హైదరాబాద్‌లలో నీరా పార్లర్‌లు అందుబాటులో ఉన్నాయి. కల్లు మత్తు కోసం కాక, ఆరోగ్యం కోసం నీరాను ఎంచుకోండి.

Also Read: PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు