London Viral Video
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: బాస్మతి రైస్‌పై డిస్కౌంట్ ప్రకటన.. మాల్‌లో ఊహించని సీన్

Viral News: డిస్కౌంట్లు కస్టమర్లను బాగా ఆకర్షిస్తాయి. డిస్కౌంట్ ఆఫర్లను కేవలం ధర తగ్గింపుగా మాత్రమే చూడకూడదు, వినియోగదారులను మానసికంగా ప్రభావితం చేసే మార్కెటింగ్ ట్రిక్‌గా కూడా పరిగణించాలి. అందుకే, డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తే అసాధారణ రీతిలో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ధరలు మండిపోతున్న ఈరోజుల్లో రేటు తగ్గుదల ఎంతోకొంత ఉపశమనం ఇస్తుందని జనాలు భావిస్తుండడమే ఇందుకు కారణం. డిస్కౌంట్ ఆఫర్లు కస్టమర్లను ఎంతలా ఆకర్షిస్తాయో ప్రత్యక్షంగా నిరూపించే ఘటన ఒకటి లండన్‌లో ఇటీవల (Viral News) చోటుచేసుకుంది.

ఈస్ట్ లండన్‌లోని వైట్‌చాపెల్ ప్రాంతంలో ఉన్న ‘సేన్స్‌బరీస్ స్టోర్‌’ ఇటీవల బాస్మతి రైస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. లైలా బాస్మతి రైస్ ఒక్కో బ్యాగ్ ధర 9.50 పౌండ్లు మాత్రమేనని అనౌన్స్ చేసింది. దీంతో ఆ మాల్‌కు కస్టమర్లు పోటెత్తారు. కస్టమర్ల హడావుడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాస్మతి బియ్యం తగ్గింపు ధరకు విక్రయించడంతో, కస్టమర్లు ఒక్కసారిగా దుకాణంలోకి ఎగబడ్డారు. వైరల్‌గా మారిన వీడియోల్లో ఎక్కువ మంది దక్షిణాసియాకు చెందిన వ్యక్తుల మాదిరిగా కనిపించారు. వాళ్లంతా పెద్ద మొత్తంలో రైస్ బ్యాగులను ట్రాలీల్లో లాక్కెళ్తూ కనిపించారు. కొందరైతే పెద్ద సంఖ్యలోనే బ్యాగులు తీసుకొని వెళ్తున్నట్టు కనిపించింది. ఇక మరికొందరైతే ఆ రద్దీలో కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు చేశారు. కానీ, ముందుకు కదలడం కష్టంగా కనిపించింది. భారీ డిస్కౌంట్‌ కావడంతో ఇంత తాకిడి ఏర్పడినట్టు మాల్ నిర్వహకులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూబీ1యూబీ2 వెస్ట్ లండన్ (సౌత్‌హాల్) అనే సోషల్ మీడియా అకౌంట్‌లో తొలుత షేర్ చేసింది. ‘‘వైట్‌చాపెల్‌లోని సేన్స్‌బరీ’’ స్టోర్‌లో లైలా బాస్మతి బియ్యాన్ని 9.50కి ఆఫర్ చేయడంతో జనాలు పెద్దఎత్తున పోటెత్తారు’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Read Also- Viral Video: స్నేహితుడి చివరికోరిక తీర్చిన వ్యక్తి.. వైరల్ వీడియో ఇదిగో

దీనిపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది హాస్యంగా పరిగణిస్తే, మరికొందరు విస్మయం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేయడం, అసహజంగా ఎగబడడంపై పలువురు విమర్శలు గుప్పించారు. ‘‘ఇలాంటి పిసినారి ప్రవర్తనను చూసి భరించలేకపోతున్నాను. కొద్దిపాటి డబ్బు ఆదా కోసం జనాలు తమ పరువు వారే తీసుకుంటున్నారు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘ఒక్కో వ్యక్తికి ఒక్క రైస్ బ్యాగ్ మాత్రమే ఇచ్చి, తీసుకున్న వ్యక్తుల చేతికి సీల్ వేయాలి. అది కొద్దిసేపు తొలగిపోకుండా ఉండాలి. ఎందుకంటే, ఇలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ వచ్చి మిగతావారికి ఏమీ దక్కకుండా కొనేస్తారు’’ అని సలహా ఇచ్చాడు.

Read Also- Army officer: ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ సిబ్బందిని చితక్కొట్టిన ఆర్మీ ఆఫీసర్.. కారణం ఇదే

మరో యూజర్ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి స్వార్థపూరిత ప్రవర్తన ఎప్పటికి ఉంటుంది. అందుకే, కొనుగోళ్లపై సూపర్‌ మార్కెట్లు పరిమితులు విధించాలి. బియ్యం మాత్రమే కొంటే ఒక్కో వ్యక్తికి ఒక్క బ్యాగ్ మాత్రమే ఇవ్వాలి. కనీసం 50 పౌండ్లకు మూడు రైస్ బ్యాగులు కొనేందుకు అనుమతించాలి. అలా చేస్తే స్వార్థపూరితంగా ఎక్కువ కొనుగోలు చేసేవారిని అడ్డుకునే అవకాశం ఉంటుంది’’ అని అన్నారు. ‘‘ఇమ్మిగ్రేషన్ సమస్యను పక్కన పెడితే, ఎక్కువ కాలం నిల్వ ఉండే వస్తువులను దాచిపెట్టుకోవడంలో చెడేమీ లేదు. బియ్యం ప్రధానాహారంగా ఉపయోగించేవారు 100 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసి పెద్ద డ్రముల్లో నిల్వ చేసి సంవత్సరం పొడవునా వాడటం సర్వసాధారణమే’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మొత్తంగా ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకున్నప్పటికీ, డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కస్టమర్ల ప్రవర్తన ఏవిధంగా ఉంటుందనేది స్పష్టమైంది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!