Team Australia Lords
Viral, లేటెస్ట్ న్యూస్

Cricket Controversy: లార్డ్స్ మైదానంలో టీమిండియా.. ఆస్ట్రేలియా టీమ్‌కు బిగ్ షాక్

Cricket Controversy: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ (ICC World Test Championship final) కోసం ఇంగ్లాండ్ (England) చేరుకున్న ఆస్ట్రేలియా టీమ్‌కు (Team Australia) అనూహ్య పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాతో (Southafrica cricket) జూన్ 11 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌కు వేదికైన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్‌లో (Lord’s Cricket Ground) ప్రాక్టీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లను అనుమతించలేదు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఆసీస్ ఆటగాళ్ల ప్రాక్టీస్ ప్రణాళికలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ప్రాక్టీస్ కోసం లార్డ్స్‌ మైదానం అందుబాటులో లేదని చెప్పినట్టుగా సమాచారం. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins), టీమ్‌లోని ఇతర ఆటగాళ్లు ఎవర్నీ అనుమతించలేదు. ఇందుకుగల ఖచ్చితమైన కారణాన్ని కూడా చెప్పలేదని సమాచారం.

Read this- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

అదే గ్రౌండ్‌లో టీమిండియా
లార్డ్స్ మైదానంలోకి ఆస్ట్రేలియా ఆటగాళ్లను అనుమతించకపోవడానికి నిర్దిష్టమైన కారణం ఏంటో తెలియరాలేదు. కానీ, ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఆటగాళ్లు అదే గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామంపై ఆసీస్ మీడియా సంస్థ ‘ఫాక్స్ క్రికెట్‌’ (Fox Cricket) ఘాటుగా స్పందించింది. ఆస్ట్రేలియా జట్టు ఖర్చులతో భారత జట్టుకు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న ప్రారంభమవనుందని, భారత జట్టు జూన్ 20 వరకు ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్ కూడా ఆడబోదని ప్రస్తావించింది. నిజానికి, లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో భారత్ జట్టు ఆడబోయే సిరీస్‌లో మూడవ మ్యాచ్. ఈ మ్యాచ్ జులై 10న ప్రారంభమవనుంది.

Read this- Mumbra Train Incident: రైళ్లోంచి పడిపోయిన ప్యాసింజర్లు.. ఐదుగురి మృతి

ఎట్టకేలకు అనుమతి
లార్డ్స్ మైదానంలోకి ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తొలుత అనుమతి ఇవ్వకపోయినప్పటికీ, చివరికి ఆదివారం అనుమతించినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ అనుమతించిన తర్వాత జట్టు ప్రాక్టీస్‌పై కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. టీమ్ సన్నాహాలు, ప్రణాళికలు దెబ్బతినకుండా ప్రయత్నిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. స్టేడియం బావుందని, తమ చుట్టూ ఎవరూ లేరని పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్‌కు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండొచ్చని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలో మిచెల్ స్టార్క్, జాష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్ వంటి మెరుగైన బౌలర్లు ఆస్ట్రేలియా వైపు ఉన్నారు. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రూపంలో 4వ సీమ్ బౌలర్ కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాడు.

Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?