Gut Problems
Viral, లేటెస్ట్ న్యూస్

Gut health: వర్షాకాలంలో పెద్ద పేగు సమస్యలు ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు?

Gut health: ఎండాకాలం పూర్తయి వర్షాకాలం మొదలైన ప్రతీసారి చాలామంది వ్యాధుల బారిన పడుతుంటారు. వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాగే, పెద్ద పేగుకు సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తుంటాయి. వాతావరణంలో పెరిగే తేమ, నీరు, ఆహార కలుషితం కారణంగా వర్షాకాలంలో పేగు సంబంధిత సమస్యలు పెరుగుతుంటాయి.

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు

కలుషిత నీరు-
వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంటుంది. తాగునీటిలో మురుగు నీరు కలిసి ప్రవహిస్తుంటుంది. దీని వలన కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది.

అధిక తేమతో బాక్టీరియా-
వర్షాకాలం సమయంలో అధిక తేమ ఉంటుంది. దీనివల్ల బాక్టీరియా, శిలీంద్రాలు వేగంగా పెరుగుతాయి. క్రమంగా ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది.

అపరిశుభ్ర ఆహారం-
భారత దేశంలో వీధి వ్యాపారాలు అధికంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా తినుబండారాలను ప్రజలు విరివిగా తింటూ ఉంటారు. వర్షాకాలంలో వీధుల్లో దొరికే ఆహారం తినడం అంత మంచిది కాదు. అలాగే, ముడి పదార్థాలను కొనుగోలు చేయడం కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో తేమ కారణంగా సూక్ష్మ క్రియుల సంతానోత్పత్తి జరుగుతుంటుంది. అవి ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.

నిల్వ చేసిన ధాన్యాల్లో ఫంగస్-
మన దేశంలో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, ఇతర గింజలను నిల్వ చేసి ఉంచుతుంటారు. అమ్మడానికైనా, ప్రభుత్వం ఉచితంగా పంచడానికైనా ఇదే పద్దతి. అయితే. ఇలా ఎక్కువ కాలం నిల్వ చేసి ఉంచడం కారణంగా గింజలను కలుషితం చేసే శిలీంద్రాల పెరుగుదల జరుగుతుంటుంది. దాని ఫలితంగా అవన్నీ కలుషితం అవుతాయి. ఇవేమీ తెలియకుండా మన వాటిని ఆహారంగా తీసుకోవడంతో పేగు సమస్యలకు దారి తీస్తుంది.

తరచూ ఇన్ఫెక్షన్లు-
వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు వస్తుంటాయి. యాంటీబయాటిక్స్ వాడవల్సి వస్తుంది. ఇలా అధికంగా వాడడం వల్ల పేగు వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరంగా అనిపించడం, విరేచనాలు తదితర సమస్యలకు కారణం అవుతాయి.

Read Also- B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

నివారణ చిట్కాలు

వేడి చేసిన నీటిని వాడాలి-
వర్షాకాలంలో కుళాయి నీటిని ఉపయోగించకుండా ఉంటే మంచిది. తప్పదు అనుకుంటే వేడి చేసినవి, ఫిల్డర్ చేసినవి తాగాలి. ఇలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చు.

తాజా ఆహారాన్నే తీసుకోవాలి-
వేడిగా ఉండి, సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని వర్షాకాలంలో తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల బాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం తక్కువ. మళ్లీ వేడి చేసినవి, మిగిలిపోయన ఆహారం జోలికి వెళ్లవద్దు.

తేలికపాటి భోజనం తీసుకోవాలి-
వర్షాకాలంలో తేలికపాటి భోజనం స్వీకరిస్తే పేగు సమస్యలకు చెక పెట్టవచ్చు. జీర్ణక్రియకు సహాయపడేలా కిచ్డీలు, సూప్‌లు, కొద్దిగా మసాలా దినుసులతో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మంచిది.

ప్రో బయోటిక్ ఆహారం కూడా-
మీరు తినే ఆహారానికి ప్రోబయెటిక్ ఫుడ్ కూడా తోడవ్వాలి. పెరుగు, మజ్జిగ, రైస్ పేగు బాక్టీరియాను నివారణకు ఉపయోగపడతాయి.

అల్లం, ఇంగువ వాడాలి-
అల్లం, ఇంగువ ఉబ్బరాన్ని నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే, పగు ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు దోహదపడతాయి.

ఆకు కూరలు, సలాడ్స్ తగ్గించాలి-
వీటిపై దుమ్ము, ధూళి, పరాన్న జీవులు ఉండే అవకాశం ఉన్నది. పూర్తిగా శుభ్రం చేయడం చాలా కష్టం. అందుకే బాగా ఉడికించి తినాలి. పచ్చివి తినడం తగ్గించాలి.

కూల్ డ్రింగ్స్, ఇతర పానీయాలు వద్దు-
వర్షాకాలంలో చల్లని పానీయాలు, ఇతర ముడి పానీయాలు జీర్ణక్రియను బలహీనపరుస్తాయి. దాని ఫలితంగా ఆహార సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Read Also- Gadwal Incident: తేజేశ్వర్ హత్య కేసులో కీలక అప్డేట్.. పచ్చి నిజాలు చెప్పేసిన బ్యాంక్ మేనేజర్! 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!