Gadwal Incident: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ (Tejeshwar) హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. రెండ్రోజులకో కొత్త కోణాలు.. మూడ్రోజులకో నివ్వెరపోయే నిజాలతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే పోలీసుల విచారణలో ఐశ్వర్య ప్రియుడు, బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో పచ్చి నిజాలు కక్కించారు ఖాకీలు. ఈ దెబ్బతో అసలు విషయాలన్నీ తన్నుకుంటూ బయటికొచ్చేశాయి. హత్య అనంతరం అడ్డంగా దొరికిపోయిన ప్రధాన నిందితులకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరశురాము, ఏ5 రాజులను నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించగా అసలు నిజాలు వెలుగుచూశాయి. ఈ మేరకు విచారణలో వెల్లడైన అంశాలను గద్వాల సీఐ టంగుటూరి శ్రీను మీడియాకు వివరించారు.
Read Also- YS Jagan: ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. తండ్రికి మించిన తనయుడువి అయితివే!
ఇదేం ట్విస్ట్ బాబోయ్..!
‘ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వరిని వివాహం చేసుకున్నది. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య, తిరుమలరావు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. భర్త తేజేశ్వర్, వారి కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ ఛేంజర్ డివైజ్‌ను ఉపయోగించి ఐశ్వర్య తల్లి గొంతులా మాట్లాడేవాడని విచారణలో తేలింది. ఐశ్వర్య పెళ్లికి ముందే ఐదు సంవత్సరాలు శారీరక సంబంధం ఉంది. కొన్ని అనివార్య కారణాలవల్ల తేజేశ్వర్‌ను ఐశ్వర్య వివాహం చేసుకుంది. తరచుగా వాయిస్ ఛేంజర్ మిషన్‌తో మాట్లాడేవారు. పదే పదే ఫోన్ మాట్లాడుతుంటే ఎవరని తేజేశ్వర్ ఇంట్లో వాళ్లు అడిగితే మా అమ్మతో మాట్లాడుతున్నానని చెప్పేది. శారీరకంగా కలవద్దని తిరుమలరావు చెప్పాడు. అందుకే ఆయన సూచన మేరకు కుంటి సాకులు చెబుతూ దాటవేసేది. ఈ వాయిస్ ఛేంజర్ పరికరాన్ని కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో పర్సనల్ లాకర్‌లో స్వాధీనం చేసుకున్నాం’ అని సీఐ మీడియాకు వివరించారు.
Read Also- Gadwal Incident: హార్ట్ బ్రేకింగ్.. ఇలా చేసుంటే తేజేశ్వర్ బతికేవాడేమో!
ఎప్పటికైనా ముప్పేనని..
‘ తేజేశ్వర్ బతికుంటే ఎప్పటికైనా సమస్యలు వస్తాయని ముందుగా వారు చేసుకున్న పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా జూన్ 13న గద్వాలలోని సంగాల చెర్వు వద్దకు రావాలంటూ తేజేశ్వర్‌కు గ్యాంగ్ ఫోన్ చేయగా అతను తన స్నేహితుడితో కలిసి వెళ్లడంతో హత్య పన్నాగం విఫలమైంది. మళ్లీ 17న డ్రైవర్ నాగేష్, పరశురాం, రాజు కలిసి గద్వాలలోని కృష్ణారెడ్డి బంగ్లా వద్ద తేజేశ్వర్‌ని కారులో ముందుగా మొగల్ రావల్ చెరువు గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వీరాపురం గ్రామ సమీపంలో గద్వాల్ కర్నూల్ ప్రధాన రహదారిపై కారులోనే అత్యంత కిరాతకంగా సుపారీ గ్యాంగ్ కారులో దాచి ఉంచిన వేట కొడవళ్లు, కత్తులతో మూకుమ్మడిగా తేజేశ్వర్‌పై దాడి చేసి, ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు’ సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు. కాగా, తనను ఎందుకు చంపుతున్నారు? కనీసం ఎవరు చంపమన్నారో అయినా చెప్పండి? అని ఆ గ్యాంగ్‌ను కాళ్లా వేళ్లా పడి బతిమలాడినట్లుగా తెలుస్తున్నది. అయినా సరే కనీసం కనికరం చూడకుండా, కత్తులతో పొడిచారని వార్తలు వస్తున్నాయి. గద్వాల ఘటనలో మున్ముందు ఇంకెన్ని సంఘటనలు, ఎలాంటి సంచలనాలు, ట్విస్టులు, కొత్త కోణాలు బయటపడుతాయో వేచి చూడాల్సిందే మరి.
ఇందుకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి..