Gadwal Incident
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Gadwal Incident: హార్ట్ బ్రేకింగ్.. ఇలా చేసుంటే తేజేశ్వర్ బతికేవాడేమో!

Gadwal Incident: ప్రేమ అన్నది.. నువ్వు లేకపోతే చచ్చిపోతా అని కన్నీరు కార్చింది.. తండ్రి లేడని, ఇష్టపడ్డ నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడింది..! కేవలం కట్నం ఇవ్వలేకనే అమ్మ ఒత్తిడితో పెళ్లికి ముందు ఇలా చేయాల్సి వచ్చిందని ముసలి కన్నీరు కార్చింది..! అమ్మాయి మాటలకు చలించిన సర్వేయర్ తేజేశ్వర్ (Tejeswar) నీవే సర్వస్వం అని నమ్మి, ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కట్న కానుకలు కాదని తిరిగి బంగారు ఆభరణాలు చేయించి పెళ్లిని తల్లిదండ్రుల సమక్షంలో బీచుపల్లి ఆంజనేయస్వామి సాక్షిగా మూడు ముళ్ళు కట్టి అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేశాడు..! తీరా పెళ్లి చేసుకున్నాక ఐశ్వర్య గతం గుర్తుకొచ్చి కాళ్ల పారాణి ఆరక ముందే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడి.. జీవితంలో స్థిరపడి వివాహం చేసుకున్న తేజేశ్వర్ జీవితం వందేళ్లు నిండకుండానే కిరాయి హంతకులతో మర్డర్‌కు పథక రచన చేసి అతి కిరాతకంగా హత్య చేయించిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తున్న పరిస్థితి.

Read Also- Viral News: సమోసాతో భర్తను లేపేసిన భార్య.. ట్విస్ట్ ఏమిటో తెలిస్తే!

సోనమ్ ఘటన మరవకముందే..
ఇటీవల మేఘాలయలోని షిల్లాంగ్‌లో పెళ్లయిన 11 రోజులకే హనీమూన్‌కి వెళ్ళగా భర్త రాజా రఘు వంశీని సోనమ్ (Sonam) కిరాయి హంతకులతో చంపించిన ఘటన చోటు చేసుకోగా తాజాగా అలాంటి ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గద్వాలకు చెందిన తేజేశ్వర్ వృత్తి రీత్యా లైసెన్స్ సర్వేయర్‌గా ఇటిక్యాల మండలంలో పనిచేస్తున్నాడు. వివాహం చేసుకునే క్రమంలో కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య కుటుంబ సభ్యులు తేజ కుటుంబాన్ని సంప్రదించారు. ఇరు కుటుంబాలు సాంప్రదాయాలు మాట్లాడుకుని గత నెల 13న వివాహానికి సిద్ధమవ్వగా అప్పటికే కర్నూల్‌లోని కెనరా బ్యాంక్‌లో పనిచేసే ఐశ్వర్య తల్లి సుజాత.. ఆ బ్రాంచ్ మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ చనువుతో ఆమె కూతురుపై సైతం అతను కన్ను పడింది. అప్పటికే పెళ్లి సంబంధం కుదరడంతో తేజేశ్వర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐశ్వర్య కొన్ని రోజుల తర్వాత నీతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఇతర నిందలు మోపి లెటర్ రాసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు చర్చించి సంబంధాన్ని విరమించుకునేందుకు అంగీకార పత్రం సైతం రాసుకున్నారు. ఇక్కడితో పెళ్లి రద్దు చేసుకొని ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేని తేజేశ్వర్ కుటుంబీకులు, బంధువులు వాపోతున్నారు. ఈ ఘటన తర్వాత వారం పాటు ప్రియుడుతో లేచిపోయిందని మృతుడి అన్న ఆరోపిస్తున్నాడు.

Aiswarya Mother

పిల్లలు లేకపోవడంతో..
వాస్తవానికి.. బ్యాంక్ మేనేజర్‌కు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను (Aishwarya) పెళ్లి చేసుకోవాలని పథకం పన్నాడు. ఈ విషయం తెలిసిన బ్యాంక్ మేనేజర్ భార్య ఈ ప్రపోజల్‌పై మండిపడి పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానని హెచ్చరించడంతో తిరుమల రావు వెనక్కి తగ్గాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న ఐశ్వర్య ప్లాన్ బెడిసి కొట్టడంతో తిరిగి తేజేశ్వర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఐశ్వర్య సింపతి డ్రామా ఆడింది. ‘ మా అమ్మ కట్నం ఇవ్వలేక నన్ను ఇబ్బంది పెట్టింద’ని అందుకే ఇలా లెటర్ రాయాల్సి వచ్చిందని, మాయమాటలు చెప్పింది. అంతేకాదు.. ‘ నువ్వంటే నాకిష్టం.. నువ్వు లేని జీవితం వృధా’ అని తనకు తండ్రి, అన్నా లేడని బ్రతిమాలి మరీ పెళ్లి చేసుకోవాలని వేడుకుంది. దీంతో చలించిపోయిన తేజేశ్వర్ అమ్మాయికి బంగారు చేయించి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో మే 17న బీచుపల్లి ఆంజనేయస్వామి సాక్షిగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఎలాగైనా ఐశ్వర్యను దక్కించుకోవాలని ఉద్దేశంతో హత్యకు కుట్ర పన్నాడు. ఐశ్వర్యతో తరచుగా 2 వేలకు పైగా ఇరువురు ఫోన్ సంభాషణలు కొనసాగించారు. భర్తకు కేవలం 150 ఫోన్ ఉన్నాయని పోలీసుల కాల్ డేటా ఎంక్వైరీలో తేలింది. పెళ్లయ్యి నెల కాగా ఎప్పుడు బిజీగా ఫోన్‌లో ఉండేదని తేజేశ్వర్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి తేజ జీవితం ముగింపుకు కుట్రప్పన్నారని అనుమానిస్తున్నామన్నారు. పెళ్లికి ముందే అమ్మాయి గురించి ఇరుగుపొరుగు వారు వివాహేతర సంబంధం ఉందని చెప్పినా, ఇంట్లో వాళ్లు సంబంధం వద్దని వారించినా ప్రేమతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా చేస్తుందని కలలో కూడా తేజేశ్వర్ ఊహించలేదు. ముందే రచించిన పథకం ప్రకారం పలుమార్లు హత్యకు కుట్ర పన్నారు.

Read Also- Mega Brothers: పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవికి ఏమైంది.. ఇప్పుడెలా ఉంది?

Aiswarya Mother

లైవ్ అప్డేట్స్ ఇస్తూ..
భర్త బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చి, సుపారీ గ్యాంగ్‌కు లొకేషన్‌ను ఎప్పటికప్పుడు భార్య తెలియజేసింది. వివాహితుడైన బ్యాంకు మేనేజర్‌కు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను ఇంటికి తీసుకెళ్లి పిల్లలు లేరు కదా ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని తన భార్యకు బ్యాంకు మేనేజర్ చెప్పాడు. అయితే భార్య నిరాకరించింది. ఇదే సమయంలో ఐశ్వర్య- తేజేశ్వర్‌ల నిశ్చితార్థం కూడా రద్దవడంతో, ఫోన్‌లో ఇద్దరితో ప్రేమాయణం నడిపించింది ఐశ్వర్య. ఐశ్వర్య మాయ మాటలు నమ్మి తన ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ, ఐశ్వర్యతో పెళ్లికి సిద్ధమయ్యాడు తేజేశ్వర్. తేజేశ్వర్‌తో పెళ్లైనప్పటికీ బ్యాంకు మేనేజర్‌తో సంబంధం కొనసాగిస్తూ, ఎలాగైనా తేజేశ్వర్ అడ్డు తొలగించుకొని.. వచ్చేస్తానని బ్యాంకు మేనేజర్‌కు మాటిచ్చింది ఐశ్వర్య. ఈ క్రమంలోనే కొంతమందికి రూ.75 వేలు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ హత్యకు పథకం బ్యాంకు మేనేజర్ కుట్రపన్నాడు. తేజేశ్వర్ బండికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి, అతని లొకేషన్‌ను సుపారీ గ్యాంగుకు అందించింది ఐశ్వర్య. ఐదుసార్లు హత్యాప్రయత్నం నుంచి తప్పించుకొని, ఆరోసారి హంతకులకు చిక్కాడు తేజేశ్వర్. ప్రైవేటు సర్వేయర్ అవ్వడంతో సర్వే చేయాలని, తేజేశ్వర్‌ను కారులో ఎక్కించుకొని హంతకులు తీసుకెళ్లారు. ముందు సీటులో కూర్చున్న తేజేశ్వర్‌ను కత్తితో గొంతుకోసి చంపి, మృతదేహాన్ని తాళ్లతో బంధించి, కవర్‌లో కట్టి.. పాణ్యం సమీపంలో గాలేరి నగర కాల్వ వద్ద హంతకులు పడేశారు. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో సహా, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హత్య చేసిన మనోజ్, సహకరించిన ఇద్దరు, క్యాబ్ డ్రైవర్ మరియు మధ్యవర్తిత్వం చేసిన ఒక వ్యక్తితో కలిపి 8 మందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారిస్తున్నారు.

Tejeswar Brother

ఫోన్ సిగ్నల్ ఆధారంగా..
పెళ్లి అయినప్పటి నుంచి పెళ్ళికి ముందు ఉన్న ప్రియుడు మోజులో తన తల్లితో కలిసి హత్యకు కుట్ర పన్నారని మృతుడి అన్న చెప్పాడు. ఆ పథకంలో భాగంగానే కిరాయి హంతకులతో తన తమ్ముడిని పొట్టన పెట్టుకున్నారని మృతుడి అక్క, అన్న కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవాల్సిందని ఇలా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాల్సిన అవసరం ఏమిటని, మాయ మాటలు నమ్మి ఇష్టంతో బంగారు చేయించి పెళ్లి చేసుకున్న పాపానికి ఈ ఘాతకానికి పాల్పడిందని మృతుని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఇప్పటికే గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. కర్నూలు వైపు కారు రాకపోకలు జరగడంతో అక్కడి పోలీసులకు కేసు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు ఒక డెడ్ బాడీ లభించడంతో గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందరితో ఎంతో చలాకీగా ఉండే తేజ వృత్తిరీత్యా సర్వేయర్‌గా కొనసాగుతూనే చిన్నప్పటి నుంచి డాన్సర్‌గా కొనసాగుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవాడని స్నేహితులు వాపోతున్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని గద్వాలలో యువకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే మృతుని భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను, హత్యలో పాల్గొన్న మరో ఇద్దరిని అదుపులో తీసుకొని గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. బ్యాంకు మేనేజర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయం గద్వాల సీఐ టంగుటూరి శ్రీను వివరణ కోరగా హత్య ఉదంతంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ మీడియాకు వెల్లడించారు.

Read Also- Rinku Singh: నిశ్చిత్తార్థం తర్వాత పెళ్లిపై రింకూ సింగ్ కీలక నిర్ణయం

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ