Viral News: అవును.. దేశంలో జరుగుతున్న తాజా ఘటనలను చూస్తుంటే అసలు పెళ్లి అవసరమా? ఒకవేళ పెళ్లి చేసుకున్నా బతికి బట్టకడతామా? ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్లుగా.. భార్యగా వచ్చే వాళ్లు ఎలాంటి వాళ్లో ఏమో.. దిన దినగండంలా ఎక్కడ రోజులు లెక్కించుకోవాల్సి వస్తుందో అని చీమ చిటుక్కుమన్నా సరే కుర్రాళ్లు భయపడిపోతున్న పరిస్థితి. ఇవన్నీ సినిమాలు, సీరియళ్ల ప్రభావమో కానీ, భర్తలను బతకనివ్వండి భార్యల్లారా? అని దండం పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఎటు పోతోంది.. ఈ సభ్య సమాజం..? ఇలా భర్తలను చంపుతూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు..? పోనీ, ఇలాంటి సంఘటనల తర్వాత ప్రశాంతంగా బతకగలరా..? అంటే అబ్బే అస్సలు లేనే లేదు కదా..? అలాంటప్పుడు ఎందుకిలా చేయాలి.. ఎవరికోసం జైలుకెళ్లాలి? అనేది కనీసం తెలుసుకోకపోతే ఎలా..!
Read Also-Viral News: ప్రియుడితో లేచిపోయిన నవ వధువు.. సంతోషంలో భర్త.. ఎందుకంటే?
అసలేం జరిగింది?
ఇటీవల కాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేసిన అనేక షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలు సమాజంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా వైవాహిక సంబంధాలలో పెరుగుతున్న సంక్లిష్టతలను, నేర ప్రవృత్తికి దారితీసే కారణాలే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ చిత్రవిచిత్రాలుగా భర్తలను చంపిన భార్యల వ్యవహారాలను చూశాం కదా.. తాజాగా తన భర్తను సమోసాతో హత్య చేసింది వధువు.. దీంతో అసలేం జరిగిందని కుటుంబీకులు, బంధువులు నివ్వెరపోయిన పరిస్థితి. పూర్తి వివరాల్లోకెళితే.. ఝార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో సునీతా దేవి అనే 22 ఏళ్ల మహిళ తన భర్త బుద్ధనాథ్ సింగ్‌ను సమోసాలో విషం కలిపి ఆహారంగా ఇచ్చి చంపేసింది. ఈ సంఘటన జూన్ 15, 2025న జరగ్గా.. వరుడి తల్లి ఫిర్యాదుతో 17న వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. సునీత, బుద్ధనాథ్‌ల పెళ్లి మే- 11న జరిగింది. అయితే, మొదటి రోజు నుంచే వారి మధ్య సఖ్యత లేదు. జూన్ 5న ఒక పంచాయితీ కూడా జరిగింది. దాని తర్వాత సునీత తన అత్తగారి ఇంటికి తిరిగొచ్చిందని పోలీసులు వెల్లడించారు. హమ్మయ్యా.. అంతా సద్దుమణిగిందని కుటుంబ సభ్యులు కాస్త ఊపిరిపీల్చుకునే లోపే పెను విషాద వార్త వినాల్సి వచ్చింది.
ఇదీ కదా ట్విస్ట్ అంటే..
జూన్ 14న, సునీత.. బుద్ధనాథ్‌ను రమణుజ్‌గంజ్ మార్కెట్‌కు తీసుకెళ్లి.. కిచెన్, గార్డెన్ కోసం పురుగుల మందు అవసరమని చెప్పి కొనుగోలు చేయించింది. జూన్ 15న రాత్రి, సునీత పురుగుల మందును బుద్ధనాథ్ తిన్న ఆహారంలో, ముఖ్యంగా సమోసాలలో కలిపి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమోసా ముక్క విరిగి ఉండటాన్ని బుద్ధనాథ్ గమనించి అడగ్గా, మాయమాటలు చెప్పిన భార్య ఆఖరికి అతన్ని తినేలా చేసింది. ఆ తర్వాత, ఆమె ప్రేమతో చికెన్ వండి తినిపించింది. చికెన్ కూర తిన్నాక భర్త అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. అయితే.. సునీత వద్ద అదనంగా రెండు పురుగుల మందు ప్యాకెట్లు కూడా ఉన్నాయని, మొదటి ప్రయత్నం విఫలమైతే వాటిని ఉపయోగించుకోవాలని భావించిందని పోలీసులు గుర్తించారు. బుద్ధనాథ్ మరణించిన తర్వాత వాటిని పొదల్లో పారవేసింది. స్థానికులు చెబుతున్న మాటల ప్రకారం చూస్తే.. సునీతకు తన స్వగ్రామంలోని ఒక యువకుడితో అక్రమ సంబంధం ఉందని చెబుతున్నారు. తన ప్రియుడితో కలిసి జీవించడానికి బుద్ధనాథ్‌ను అడ్డు తొలగించుకున్నదని క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. కాగా, బుద్ధనాథ్ తల్లి రాజమతి దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సునీతను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. పోస్ట్‌మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. రిపోర్టులో ఏముంటుందో.. ఏంటో మరి.
Read Also- Mega157: చిరు-అనిల్ చిత్రం.. సంక్రాంతి కంటే ముందే రిలీజ్ అవుతుందేమో!