UP Viral News
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: ప్రియుడితో లేచిపోయిన నవ వధువు.. సంతోషంలో భర్త.. ఎందుకంటే?

Viral News: పెద్దల సాక్షిగా కట్టుకున్న భాగస్వాములను మోసం చేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. వైవాహిక జీవితంలో ఉండి పరాయి వాళ్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి భాగస్వాములను, కడుపున పుట్టిన పిల్లలను సైతం అడ్డు తొలగించుకుంటున్నారు. మరికొందరైతే పెళ్లైన కొత్తలోనే ప్రియులతో కలిసి పారిపోతున్నారు. చేజేతులారా సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో (Viral News) వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ యువతి పెళ్లైన కొన్ని రోజులకే ప్రియుడితో లేచిపోయింది.

నవ వధువు తన ప్రియుడితో పారిపోవడంతో అందరూ నిర్ఘాంతపోయారు. భర్త మాత్రం పెద్దగా పరేషాన్ కాలేదు. ఆమె కోసం వెతకడానికి ప్రయత్నించలేదు. కనీసం చట్టప్రకారం నడుచుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఒక ఫిర్యాదు మాత్రం చేసి ఊరుకున్నాడు. ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండాలనే ఆమె నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పాడు. ‘‘నేను మరొక రాజా రఘువంశీగా (హనీమూన్ మర్డర్) మారకుండా తప్పించుకున్నాను!. అదే పదివేలు’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఆ బాధిత వ్యక్తి పేరు సునీల్. మే 17న ఖుష్బూ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన మరుసటి రోజు తన అత్తింటికి వెళ్లింది. అక్కడ తొమ్మిది రోజులు గడిపిన తర్వాత, వివాహ సంప్రదాయంలో భాగంగా తొలి మనుగుడుపుగా అమ్మనాన్నల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి అటే ప్రియుడితో లేచిపోయింది.

Read this- Samantha: సమంతకు చేదు అనుభవం.. వద్దన్నా, అలా వెంటపడుతున్నారేంటి?

స్టేషన్‌కు వచ్చిన నవవధువు
భార్య కనిపించకుండా పోవడంతో సునీల్ వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ప్రకారం, రంగంలోకి దిగిన పోలీసులు ఖుష్బూ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఖుష్బూ, సోమవారం తానంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇష్టపూర్వకంగా తానే ప్రేమికుడితో పారిపోయినట్లు అంగీకరించింది. అతడితోనే కలిసి జీవించాలనుకుంటున్నట్టు ఖరాఖండిగా చెప్పింది.

అందరూ ఆశ్చర్యపోయేలా సునీల్ కూడా ఆమె కోరికను మన్నించి వదిలేశాడు. ‘‘హనీమూన్ కోసం ఖష్బూని నైనిటాల్‌ తీసుకెళ్దామని నేన్ ప్లాన్ చేశాను. కానీ, ఆమె ప్రియుడితో కలసి ఉండాలనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను. నేను కూడా సంతోషంగానే ఉన్నారు. ఇక్కడ జరిగిన మంచి విషయం ఏమిటంటే, నేను మరొక రాజా రఘువంశీగా మారకుండా తప్పించుకున్నాను!. మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాం. నా భార్య ఆమె ప్రియుడి ప్రేమను పొందుతోంది. నా కథ ముగిసిపోలేదు సంతోషం’’ అని సునీల్ పేర్కొన్నాడు.

Read this- Honeymoon Case: హనీమూన్ కేసులో వెలుగులోకి మరో వాస్తవం.. అందరూ షాక్

సామరస్యంగా పరిష్కారం

మొత్తంగా పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. విడిపోయేందుకు, ఒకరి జీవితానికి మరొకరు అడ్డురాకుండా ఉండేందుకు ఖుష్బూ, సునీల్ ఇద్దరూ పరస్పర అంగీకరించారు. పెళ్లి సమయంలో ఖుష్బూకు అత్తింటివారు పెట్టిన నగలు, ఇతర వస్తువులను ఆమె వైపు కుటుంబ సభ్యులు తిరిగి ఇచ్చేశారు. ఎలాంటి చట్టపరమైన చర్యలు లేకుండానే వివాదాన్ని పరిష్కరించుకున్నారు.

ఈ వ్యవహారంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరేంద్ర సింగ్ స్పందిస్తూ, వధువు తన భర్తతో ఉండటానికి నిరాకరించిందని వెల్లడించారు. తన ప్రేమికుడితో ఉంటానంటూ పట్టుబట్టిందని, రెండు కుటుంబాల మధ్య పరస్పర అంగీకారం ద్వారా వస్తువులను తిరిగి ఇచ్చుకున్నారు. కేసు నమోదు కాకపోయినప్పటికీ, ప్రతి అంశాన్ని అధికారికంగా రికార్డ్ చేశాం. ఖుష్బూ తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. వరుడి కుటుంబం స్టేషన్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయిందని ఆయన వివరించారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన అంగీకారం అధికారికంగా నమోదు కావడంతో ఈ వ్యవహారంపై తదుపరి చట్టపరమైన సమస్యలు ఏమీ ఉండబోవని వివరించారు.

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు