CM Pushkar Dhami: ఇదిగో ఈ ఫొటోలో వైట్ అండ్ వైట్‌లో ఉన్న వ్యక్తిని సామాన్యుడు అనుకుంటున్నారేమో.. కాదండోయ్ ముఖ్యమంత్రి..! అవునా.. ఇదేంటి సీఎం అయ్యుండి ఇలా చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు కదూ..! అవును.. అప్పుడప్పుడు చీఫ్ మినిస్టర్‌లు కూడా కామన్ మ్యాన్‌లుగా మారిపోతుంటారు కదా.. అదే ఇదన్న మాట. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి సింగ్.. నాగ్లాతరై గ్రామంలోని తన నారుమడిలో దిగి నాగలితో దున్నుతూ.. వరినాట్లు వేస్తూ కొద్దిసేపు కూలీలతో గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు. ‘ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసి రైతుల కృషి, త్యాగం, అంకితభావంను నేను స్వయంగా తెలుసుకున్నాను. అలనాటి పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఈ రైతులు మన ఆర్థికవ్యవస్థకు వెన్నెముక. అంతేకాదు.. రైతులు భావితరాలకు మన సంస్కృతిని అందించే వారధులు’ అని పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, హుడ్కియా బాల్ అనే సంప్రదాయం ప్రకారం భూమి, నీరు, మేఘాలకు పూజలు చేస్తూ వరి నాట్లు వేశారు. అంతా ఓకేగానీ.. మునుపెన్నడూ లేనట్లుగా సీఎం ఇప్పుడు ఎందుకిలా చేశారు..? అయినా ఇంత సడన్‌గా సీఎం కాస్త స్టంట్ మాస్టర్‌గా ఎందుకు మారారు..? అని ప్రత్యర్థులు, విమర్శకులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి.
Read Also- Radha Manohar Das: లైవ్‌లో రచ్చ రచ్చ చేసిన రాధా మనోహర్.. నవ్వులే నవ్వులు!
ఎందుకనీ?
సాధారణంగా ముఖ్యమంత్రులు ఇలాంటి పనులు చేయడం అరుదు. అయితే ధామి ఇలా చేయడానికి వెనుక అనేక కారణాలు, సందేశాలు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్ పహాడీ (కొండ) రాష్ట్రం. ఇక్కడ వ్యవసాయం, ముఖ్యంగా వరి, గోధుమ సాగు ప్రజల జీవనానికి ఆధారం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో ప్రజలకు బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా పొలంలో దిగడం ద్వారా, ఆయన పహాడీ సంస్కృతిని, వ్యవసాయ జీవనాన్ని గౌరవిస్తున్నారని, ప్రజలతో మమేకమవుతున్నారని చూపించారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను తాము అర్థం చేసుకుంటున్నామని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చాటిచెప్పడానికి సీఎం ఇలా చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. స్వయంగా ఆయనే పొలంలోకి దిగి వరి నాట్లు వేయడం ద్వారా, రైతుల కష్టాన్ని గుర్తించి, వారికి మానసిక మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించారని అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇది రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వ్యవసాయానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను తెలియజేయడానికి ఇదొక బలమైన సంకేతం. అంతేకాదు.. యువతను కూడా వ్యవసాయ రంగం వైపు ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చర్య అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఒక సామాన్య రైతులా పొలంలో దిగి పని చేయడం ద్వారా, తాను ప్రజల మనిషి అని, వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చూపించుకున్నారు. ఇది ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని పొందడానికి సహాయపడుతుంది.
ఇందుకేనా?
రాజకీయ నాయకులకు ఇలాంటి కార్యక్రమాలు ఒక రకమైన సానుకూల ప్రచారమే అని చెప్పుకోవచ్చు. సీఎం పొలంలో పని చేస్తున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి, ఇది ఆయనకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ఇది ముఖ్యమంత్రి కార్యాచరణను, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని హైలైట్ చేస్తుంది. వరి నాట్లు వేయడం అనేది భారతీయ వ్యవసాయ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. సీఎం స్వయంగా ఇందులో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలోని సంప్రదాయాలు, విలువలకు తాను ఎంత గౌరవం ఇస్తున్నారో తెలియజేశారు. అంతేకాదు.. పరిపాలన అంటే కేవలం సచివాలయంలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం కాకుండా, క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని సీఎం ఈ చర్య ద్వారా సందేశం ఇచ్చారు. తాను ప్రజల పక్షపాతిగా కనిపించడం ద్వారా, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంబంధిత పథకాలు (ఎరువులు, విత్తనాలు, రుణ సౌకర్యాలు మొదలైనవి) సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒకెత్తయితే.. పుష్కర్ సింగ్ ధామి యంగ్ చీఫ్ మినిస్టర్. ధామికి క్రియాశీలకంగా, ప్రజలతో కలిసిపోయేవారిగా పేరుంది. ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి స్టంట్లు చేస్తున్నప్పుడు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తారని విమర్శలు వస్తున్నాయి. ఇది ఓటర్లను ఆకట్టుకోవడానికి, తమ పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు.
Read Also- Ghaati: స్వీటీ అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఇలా చేశారేంటి?
खटीमा के नगरा तराई में अपने खेत में धान की रोपाई कर किसानों के श्रम, त्याग और समर्पण को अनुभव कर पुराने दिनों का स्मरण किया। अन्नदाता न केवल हमारी अर्थव्यवस्था की रीढ़ हैं बल्कि संस्कृति और परंपरा के संवाहक भी हैं। pic.twitter.com/2ctv5O6v3p
— Pushkar Singh Dhami (@pushkardhami) July 5, 2025