Radha Manohar Das: రాధా మనోహర్ దాస్.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవక్త, ఉపన్యాసకులు. ముఖ్యంగా సనాతన ధర్మం, భగవద్గీత ఇతర హిందూ గ్రంథాలపై ప్రవచనాలు ఇస్తుంటారు. ఆయన ఉపన్యాసాలు సాధారణంగా ఆధ్యాత్మిక విలువలు, నైతిక జీవనం, ధార్మిక ఆచారాలపై దృష్టి సారిస్తాయి. నిత్యం ఇతర మతాలపై.. ముఖ్యంగా క్రైస్తవం, ఇస్లాం మత గ్రంథాలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈ విమర్శలు తరచుగా మతపరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తాయి. ఆయన తన ప్రసంగాల్లో బైబిల్, ఖురాన్‌లోని కొన్ని భాగాలను ప్రస్తావిస్తూ, వాటిని తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. అయితే.. రాధా ఉపన్యాసాలకు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన బోధనలు తరచుగా వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం, ధార్మిక జీవనశైలిని ప్రోత్సహించేలా ఉంటాయి. తాజాగా.. ‘స్వేచ్ఛ-బిగ్ టీవి’కి రాధా మనోహర్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. యథావిధిగా వివాదాస్పదంగానే ప్రవర్తించారు. ముఖ్యంగా లైవ్‌లోనే ఇతర మతస్థులకు ఫోన్ కాల్ చేయడం, ఏదో ఒక రచ్చకు దారితీసేలా ప్రవర్తించడం చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఏం చెప్పారు..? ఏయే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి..? అనే విషయాలు చూద్దాం..
బైబిల్ ప్రస్తావనలు..
ఇంటర్వ్యూలో భాగంగా రాధా మనోహర్ బైబిల్‌లోని కొన్ని భాగాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఎచ్కేల్ చాప్టర్ 4.12 గురించి ప్రస్తావించారు. ఆ వాఖ్యానికి వివరణ ఇస్తూ.. ఈ భాగంలో బార్లీ గింజలతో అప్పాలు చేసి మనుషుల పెంటతో కాల్చి తినడం గురించి ఉందని వివరించారు. ఈ ప్రస్తావన ద్వారా బైబిల్‌లోని కొన్ని విషయాలు ప్రస్తుత నాగరిక సమాజానికి అంగీకారయోగ్యం కాదని, అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే రాధా లైవ్‌లో మాట్లాడిన మాటలు, ఆయన అభిప్రాయాలతో పలువురు కాలర్స్ ఏకీభవించలేదు. కొందరేమో తనకు ఎందుకు కాల్ చేస్తున్నారు..? నెంబర్ ఎవరిచ్చారు..? అని ప్రశ్నించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు క్రైస్తవులు, గల్ఫ్‌లో ఉంటున్న కొందరికి కూడా ఫోన్లు చేశారు. అయితే.. ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడగా.. ఆ వ్యక్తి తన దేవుడు ప్రభువును దూషించవద్దని కోరారు. అయితే దీనికి దాస్ స్పందిస్తూ.. ‘ దేవుడు ఎవడు ఉన్నాడు సార్ వాడు ఎవడు..? నేను కూడా ప్రభువునే కొలుస్తాను. కానీ మా రామచంద్ర ప్రభువు వేరే’ అని సమాధానం చెప్పారు. కదిరి కృష్ణ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ.. అతను బైబిల్ వల్లే అలా తయారయ్యాడని, అతను మంచోడే కానీ రోగి, పాపిగా తయారయ్యాని చెప్పారు. అందుకే.. కృష్ణ మనసు మారి అన్నమయ్య కీర్తనలు పాడాలని ఆకాంక్షించారు. కదిరి కృష్ణ బైబిల్‌తో పాటు ఖురాన్ కూడా చదవాలని సూచించారు.
అందరూ అప్డేట్ అవ్వండి..
ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా.. రాధా మనోహర్ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని బలంగా నొక్కి చెప్పారు. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానమని, అది మానవాళి శ్రేయస్సు కోసం రూపొందించబడిందని తన ఉద్దేశాన్ని చెప్పారని అనుకోవచ్చు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, మనిషి అప్డేట్ అవ్వాలని దాస్ అభిప్రాయపడ్డారు. ఆది మానవుడు పచ్చి మాంసం తినే స్థితి నుంచి ఇప్పుడు వండుకొని తినే స్థితికి వచ్చాడని, అయితే జంతువులను తినకుండా ఉండే స్థితికి మనిషి అప్డేట్ అవ్వాలని సూచించారు. మొత్తమ్మీద ఈ ఇంటర్వ్యూలో మతపరమైన అభిప్రాయాలు, ఇతర మతాలపై ఆయనకున్న విమర్శలు, సనాతన ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. ‘నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడ్రా రెస్పాన్సిబులిటీ’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే ఈయనకు రెండ్రోజులకో వివాదం.. మూడ్రోజులకో మాటల యుద్ధం మామూలైపోయింది.. దేవుడు అన్నీ చూస్తున్నాడని శపించిన వాళ్లూ ఉన్నారు. తమరి దేవుడి గురించి ఎక్కువ చేసి చెప్పుకో అంతేకానీ.. ఎదుటి వ్యక్తుల దేవుడి గురించి తమరికెందుకు? ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈయనపై ఉన్న అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు..
వీడియో ఇక్కడ చూసేయండి..