Anushka Ghaati Poster
ఎంటర్‌టైన్మెంట్

Ghaati: స్వీటీ అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఇలా చేశారేంటి?

Ghaati: అనుష్క శెట్టి (Anushka Shetty)ని వెండితెరమీద చూడాలనుకునే అభిమానులకు మరో సారి నిరాశే ఎదురైంది. జేజమ్మ రాక కోసం సినీ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ‘ఘాటి’ సినిమాతో వెండితెరను కనువిందు చేస్తుందనుకుంటే మరోసారి అభిమానులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘాటి’ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14 ‘ఘాటి’ (Ghaati) సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అది కాస్త జూలై 11 వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

Also Read- MLC Kavitha: ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో.. ఎమ్మెల్సీ కవిత

‘‘సినిమా ఒక జీవనదిలాంటిది.. అది ప్రవహిస్తుంటుంది. ‘ఘాటి’ కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది ఒక ప్రతిధ్వని.. ఒక అడవి గాలి.. మట్టి నుండి పుట్టిన కథ. ప్రతి ఫ్రేమ్‌ను మీకు అద్భుతంగా అందించాలనే ఉద్దేశంతో ఉన్నత ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దుతున్నాం. ఈ నిరీక్షణ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే, మధురమైన అనుభూతిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ ప్రయాణంలో మీరు మాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని మూవీ టీమ్‌ ఓ లేఖను విడుదల చేసింది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ కారణంగా ఈ సినిమా వాయిదా పడిందని చిత్రబృందం ద్వారా తెలుస్తోంది.

Also Read- TIMS Multi Specialty Hospitals: నగరంలో త్వరలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత అనుష్క నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరనే విషయం తెలియంది కాదు. అలాంటి ఓ సినిమా అనుష్క నుంచి వస్తుందంటే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటుతాయి. దానికి ‘వేదం’ లాంటి సందేశాత్మక చిత్రాలు తీసిన క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారంటే.. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. యాక్షన్‌ క్రైమ్ డ్రామాగా దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విక్రమ్‌ ప్రభు, రమ్య కృష్ణ, జగపతి బాబు తదితర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేజమ్మతో కలిసి నటించడంపై విక్రమ్ ప్రభు తన సంతోషాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. ‘ఘాటి’ సినిమా కోసం దాదాపు ఎనిమిది కిలోలు తగ్గానని, స్వీటీతో కలిసి నటించడం చాలా సరదాగా ఉంటుందని, ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.

డ్రగ్స్ మాఫియా నేపథ్యానికి ఓ బలమైన సామాజిక అంశాన్ని జోడించి క్రిష్‌ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఘాటి’ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్.. ‘అరుంధతి’ స్థాయిలో పూనకాలు తెప్పించిన విషయం తెలియంది కాదు. సాంగ్ అయితే సంగీత అభిమానులను కట్టిపడేస్తుంది. అనుష్క మరోసారి ‘అరుంధతి’ని మించి హిట్ అందుకుంటుందని గ్లింప్స్ చూసిన సినీ క్రిటిక్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది అయితే ప్రస్తుతానికి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!