TIMS Multi Specialty Hospitals: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రకటించారు. నగరం నలుమూలలా ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన హైదరాబాద్లో ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
అప్పటి నుండి వైద్య సేవలు అందుబాటులోకి
ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల్లో స్పీడ్ పెంచాలనియ అన్నారు. హాస్పిటళ్ల సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులకు మంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఒక టైమ్‌లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ప్రారంభించిన రోజు నుండే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ 4 హాస్పిటళ్ల కోసం అధునాతన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్విప్‌మెంట్ కొనుగోలులో సంబంధిత డాక్టర్లు, టెక్నికల్ ఎక్స్‌పర్టుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Notice to Political Parties: బిగ్ బ్రేకింగ్.. 13 రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్!