Notice to Political Parties: రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్!
Notice to Political Parties (imagecredit:twitter)
Political News

Notice to Political Parties: బిగ్ బ్రేకింగ్.. 13 రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్!

Notice to Political Parties: రాష్ట్రంలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు (RUPP) భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ( తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుధర్శన్ రెడ్డి(Sudharshan Reddy) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయా పార్టీలు చట్టానికి అనుగుణంగా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. దీంతోనే షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. తమ రిజిస్టర్ నుంచి తొలగించే ముందు పార్టీలు తమ వివరణను ఈ ఏడాది జూలై 11 వరకు సమర్పించాలని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాతపూర్వక వివరణ, సహాయక పత్రాలు, పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించారు. అంతేకాక, జులై 15, 2025న విచారణకు హాజరు కావాలని, పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అధీకృత ప్రతినిధి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. షోకాజ్ నోటీసులపై స్పందించని సమయంలో ఈసీఐ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఈవో నొక్కి చెప్పారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29ఏ

ఇక ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ఎన్నికలలో పాల్గొనడానికి ఉద్దేశించబడుతుంది. అయితే ఈసీఐ(ECI) రికార్డుల ప్రకారం, గత ఆరు సంవత్సరాలలో సాధారణ, శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎటువంటి అభ్యర్థులను నిలబెట్టకపోతే ఈసీ(EC) చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆయా నిబంధనల ప్రకారంఈ 13 పార్టీలు చట్టం ఆశించిన విధంగా పనిచేయలేదని ఈసీ పేర్కొన్నది.

0Delta Air Lines: విమానం గాల్లో ఉండగా ఊడిన రెక్క.. ఫ్లైట్‌లో 115 మంది.. చివరికి?

షోకాజ్ నోటీసులు అందుకున్న 13 రాజకీయ పార్టీల జాబితా
1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ
2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ
3. జాగో పార్టీ
4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
5. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ
6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం
7. యువ పార్టీ
8. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే)
9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ
11. జాతీయ మహిళా పార్టీ
12. యువ తెలంగాణ పార్టీ
13. తెలంగాణ ప్రజా సమితి

Also Read: Illegal Bike Taxi: మంత్రి స్టింగ్ ఆపరేషన్.. సామాన్యుడిలా మారి.. బైక్ ట్యాక్సీల గుట్టురట్టు!

 

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!