Viral Video: వర్షాకాలంలో వాహనదారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా నగరాల్లో చిన్న చినుకు పడితేనే రోడ్లపైకి నీరు వచ్చేస్తుంటాయి. అలాంటి రోడ్లపై కారు నడపడమంటే పెద్ద సాహసమనే చెప్పాలి. రోడ్లపై ప్రవహించే నీటి కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే ఓ వాహనం.. చైనాలో కనిపించింది. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వాహనం.. మన రోడ్లపై ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని చావ్ జౌ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఓ వ్యక్తి మాత్రం భారీ చక్రాలతో ఉన్న కారును రోడ్డుపై ఎంచెక్కా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఆ కారు పెద్ద సైజ్ దృఢమైన చక్రాలను కలిగి ఉంది. లోతైన నీటిలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోతోంది. దీంతో తోటి వాహనదారులు.. ఆ కారును తమ కెమెరాల్లో బంధించి వైరల్ చేశారు.
Also Read: Viral Video: ఓరి మీ తెలివి తగలెయ్యా.. కారును అక్వేరియంలా మార్చుశారు కదరా!
కారు యజమాని ఏమన్నారంటే?
తోటి వాహనదారులు కారులో చేసిన మార్పును ప్రశంసిస్తున్నప్పటికీ.. యజమని పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. యజమాని శ్రీ షెన్ మాట్లాడుతూ.. తన కారు చక్రాలు ఎక్కువ కాలం నిలవలేదని పేర్కొన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా కారును ఇష్టం వచ్చినట్లు మార్పు చేసినందుకు పోలీసులు తన వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. కాబట్టి ఇతరులు తమ వాహనంలో మార్పు చేసుకునేటప్పుడు చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు.
View this post on Instagram