ChatGPT Saves Dog: చాట్ జీపీటీ (ChatGPT)ని ఉపయోగించి.. ఓ యజమాని తన పెంపుడు శునకం ప్రాణాలు కాపాడిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెంపుడు కుక్క ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో దానికున్న లక్షణాలను చాట్ జీపీటీలో పోస్ట్ చేసినట్లు యజమాని తెలిపారు. అప్పుడు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానంతో అప్రమత్తమై సొంత వైద్య చేశానని.. తద్వారా తన కుక్కను కాపాడుకున్నానని ఓ వ్యక్తి పేర్కొనడం ఆసక్తిరేపుతోంది.
అసలేం జరిగిందంటే?
చాట్ జీపీటీ డ్యూడ్ అనే తన పెంపుడు కుక్క విషయంలో చేసిన సాయం గురించి ఓ వ్యక్తి రెడ్డిట్ (Reddit)లో పంచుకున్నారు. దాని ప్రకారం ఇటీవల డ్యూడ్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో పశువైద్యులకు చూపించగా.. దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధితో అది బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. సమయం మించిపోవడంతో పెంపుడు కుక్క బతికేందుకు 5 శాతం మాత్రమే అవకాశముందని స్పష్టం చేశారు. అయితే ఆశ కోల్పోని యజమాని.. అనూహ్యంగా చాట్ జీపీటీని ఆశ్రయించారు. తన శునకానికి ఉన్న వ్యాధి లక్షణాలు, వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గం చూపమని చాట్ జీపీటీని కోరారు.
someone saved there dying dog because of researching on ChatGPT vs. listening to Vet, who said there is no hope! pic.twitter.com/zYoH6U25De
— Ankit Sawant (@SatanAtWink) January 22, 2026
చాట్ జీపీటీ చేసిన సాయం ఏంటంటే?
అప్పుడే చాట్ జీపీటీ అద్భుతం చేసిందని యజమాని తెలిపారు. డ్యూడ్ ను బతికించుకోగల మరో అవకాశాన్ని చాట్ జీపీటీ చూపించిందని పేర్కొన్నారు. డ్యూడ్ శరీర బరువు, పరిస్థితి ఆధారంగా వెటర్నరీ వైద్యులు ఇస్తున్న దానికంటే ఎక్కువ పరిమాణంలో IV ద్రవాలను ChatGPT సూచించింది. ప్రస్తుతం శునకం ఉన్న పరిస్థితిలో ఇది చాలా అవసరమని నొక్కి చెప్పింది. ఈ విషయాన్ని వెటర్నరీ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లగా.. అలా చేసేందుకు వారు సంసిద్ధత చూపలేదని యజమాని తెలిపారు. దీంతో యజమాని.. శునకాన్ని ఇంటికి తీసుకొచ్చి చాట్ జీపీటీ సూచించిన విధంగా తానే చికిత్స చేయడం ప్రారంభించారు.
Also Read: Wife Kills Husband: రాష్ట్రంలో మరో ఘోరం.. బెయిల్ ఇప్పించి మరీ.. భర్తను హత్య చేయించిన భార్య!
ఫైనల్‌గా కోలుకున్న డాగ్!
చాట్ జీపీటీ సూచించిన చికిత్స ప్రణాళికను క్రమం తప్పకుండా అమలు పరిచినట్లు యజమాని రెడ్డిట్ లో చెప్పారు. దీంతో కొన్ని వారాల తర్వాత డ్యూడ్ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించిందని అతను స్పష్టం చేశారు. ప్రస్తుతం డ్యూడ్ పూర్తిగా కోలుకున్నాడని.. చెబుతూ శునకానికి సంబంధించిన ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారి తీసింది. యజమాని తీసుకున్న డేరింగ్ స్టెప్ ను కొందరు యూజర్లు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలా చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు రావొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.

