Wife Kills Husband: భర్తను భార్యలు అతి దారుణంగా చంపుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో ఈ తరహా ఘటనే ఒకటి జరిగింది. జైలు కెళ్లిన భర్తను బెయిల్ పై తీసుకొచ్చి మరి ఓ భార్య హతమార్చింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేస్తోంది. తమ్ముడితో కలిసి భర్తను అంతమెుందించినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం అంకాలమ్మ గుడి దగ్గర ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన లాల్ శ్రీను, ఝాన్సీ భార్య భర్తలు. భర్త శ్రీను చెడు వ్యసనాలకు బానిసై తరుచు జైలుకు సైతం వెళ్లొస్తుండేవాడు. ఈ క్రమంలోనే భార్యకు స్థానికంగా ఉండో మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమపై భార్య, భర్తల మధ్య తురుచూ గొడవలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
అడ్డు తొలగించుకోవాలని..
నవంబర్ లో ఓ కేసుకు సంబంధించి పెద్ద దోర్నాల పోలీసులు లాల్ శ్రీనును అరెస్టు చేసి జైలుకు ఒంగోలు జైలుకు పంపారు. అప్పటి నుంచి లాల్ శ్రీను జైలులోనే ఉన్నాడు. అయితే తన భర్తతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన ఝాన్సీ.. అతడి అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని పథకం రచించింది. అతడ్ని బయటకు తీసుకొచ్చి హత్య చేయాలని భావించింది. పథకంలో భాగంగా భర్తకు బెయిల్ కూడా ఇప్పించింది.
పక్కా ప్లాన్‌తో..
ఒంగోలు జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలోనే మార్గం మధ్యలో భర్తను లేపేయాలని ఝాన్సీ ప్లాన్ చేసింది. ఇందుకోసం తమ్ముడు అశోక్ సాయం తీసుకుంది. రూ.2 లక్షల సుపారీ ఇచ్చి ఓ గ్యాంగ్ ను సైతం రంగంలోకి దించింది. హత్యకు కావాల్సిన కత్తులు, కారపొడులను తీసుకొని వారంతా కారులో ఈ నెల 21వ తేదీన ఒంగోలు జైలు వద్దకు వెళ్లారు. అక్కడ లాల్ శ్రీనును ఎక్కించుకొని పెద్ద దోర్నాలకు తిరుగు ప్రయాణమయ్యారు.
Also Read: Medaram Special Trains: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు..?
కాళ్లల్లో కారం కొట్టి..
భర్త లాల్ శ్రీనుతో కారులో బయలుదేరిన అనంతరం తమ ప్లాన్ ను అమలు చేయడానికి ఝాన్సీ ప్రణాళికలు వేసింది. తొలుత ఒంగోలులో చంపాలని భావించినా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తర్వాత చీమకుర్తి, పొదిలి ప్రాంతాల గుండా వెళ్తున్న సమయంలో హత్య చేయాలని భావించినా.. జనం రద్దీ కారణంగా కుదరలేదు. చివరకి మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం అంకాలమ్మ గుడి దగ్గర రాగానే ఇదే సరైన సమయం అని భావించి.. భర్త లాల్ శ్రీను కంట్లో భార్య ఝాన్సీ కారం చల్లింది. ఆ వెంటనే ఝాన్సీ తమ్ముడు అశోక్, సుపారీ గ్యాంగ్ కత్తులతో లాల్ శ్రీనుపై విరుచుకుపడ్డాయి. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఝాన్సీ, ఆమె సోదరుడు అశోక్ ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
బెయిల్ ఇప్పించి మరీ భర్తను హత్య చేయించిన భార్య
మార్కాపురం సమీపంలోని పెద్దారవీడు మండలం అంకాలమ్మ గుడి దగ్గర లాల్ శ్రీను హత్య
గంజాయి కేసులో అరెస్టు అయిన లాల్ శ్రీను
భర్తను హత్య చేయాలన్న ప్లాన్ తోనే బెయిల్ ఇప్పించిన ఝాన్సీ
జైలు నుంచి తీసుకొస్తూ తమ్ముడితో కలిసి శ్రీను కళ్లలో కారం… pic.twitter.com/0XKCjA46fH
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2026

