Medaram Special Trains: సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు
Medaram Special Trains (imgecredit:twitter)
Telangana News, ఆంధ్రప్రదేశ్

Medaram Special Trains: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు..?

Medaram Special Trains: మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఈ నెల 28 నుంచి నడుపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, మంచిర్యాల, సిరిపూర్‌ కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్‌, కాజీపేటల వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి శ్రీధర్‌ వెల్లడించారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్‌ రిజర్వుడ్‌(సాధారణ రైళ్లు) అని, జాతరకు వెళ్లే భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరారు.

సికింద్రాబాద్‌ – మంచిర్యాల – సికింద్రాబాద్‌

ఈ నెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో ప్రత్యేక రైళ్లు కాజీపేట మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్‌ – మంచిర్యాల రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల చేరుకుంటుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల – సికింద్రాబాద్‌ రైలు(07496) మంచిర్యాలలో బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజీపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌ – సిరిపూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్‌

ఈ నెల 29, 31 తేదీల్లో సికింద్రాబాద్‌ – సిరిపూర్‌ కాగజ్‌ నగర్‌ -సికింద్రాబాద్‌ మేడారం (07497/07498) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ తేదీలలో మేడారం జాతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు కాజీపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటాయి.

Also Read: Divi Vadhya: ప్రేమించడం అంటే అంత ఈజీ కాదు.. బ్రేకప్ తర్వాత అవి కామన్.. నటి దివి

నిజామాబాద్‌ – వరంగల్‌ – నిజామాబాద్‌

నిజామాబాద్‌ – వరంగల్‌ – నిజామాబాద్‌ మేడారం జాతర ప్రత్యేక రైళ్లు (07498/07499) ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటాయి.

ఖమ్మం – కాజీపేట – ఖమ్మం

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం – కాజీపేట – ఖమ్మం మేడారం ప్రత్యేక రైళ్లు (07503/07504) ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి.

ఆదిలాబాద్‌ – కాజీపేట – ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ – కాజీపేట (07501)మేడారం జాతర ప్రత్యేక రైలు ఈ నెల 28న రాత్రి 11.30 గంటలకు ఆదిలాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు (29 తేదీ) ఉదయం 11.45 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అలాగే కాజీపేట – ఆదిలాబాద్‌ (07502)మేడారం ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు కాజీపేటలో బయలుదేరి మరుసటి రోజు (30వ తేదీ) తెల్లవారు జామున 4 గంటలకు ఆదిలాబాద్‌ చేరుకుంటుంది.

Medaram Special Trains: మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఈ నెల 28 నుంచి నడుపనున్నట్లు ప్రకటించింది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?