polyandry
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Polyandry: ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవడంపై తొలిసారి స్పందించిన అన్నదమ్ముళ్లు

Viral Polyandry: హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఓ వివాహం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇద్దరు అన్నదమ్ముళ్లు కలిసి ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ఈ చర్చకు కారణమైంది. అయితే, పరిణయం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు కొత్త పెళ్లి కొడుకులు తమ వివాహంపై (Viral Polyandry) స్పందించారు. ఇద్దరూ కలిసి ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవడాన్ని సమర్థించుకున్న సోదరులు, హట్టీ తెగలో ఈ ‘బహుభర్తత్వం సంప్రదాయాన్ని’ శతబ్దాలుగా ఉందని అన్నదమ్ముళ్లు ప్రదీప్, కపిల్ నేగీలు తెలిపారు.

‘జోడిదార్ ప్రథా’ అనే సంప్రదాయం చాలా కాలంగా ఉందని తెలిపారు. బంధుత్వం ఉన్నవారు బహుభర్తత్వాన్ని అనుసరిస్తారని, ఈ పద్దతి ప్రకారమే తమ వివాహం జరిగిందని ప్రదీప్ వెల్లడించాడు. ‘జోడిదార్ ప్రథా’ పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తోందని, తామేమీ మొదటి వ్యక్తులం కాదని, తమతోనే ఈ ఆచారం అంతం కాబోదని ప్రదీప్ చెప్పాడు. కుటుంబ సభ్యుల సమ్మతితో, సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగిందని, వైవాహిక జీవితంలో తాము సంతోషంగా జీవిస్తున్నామని వివరించాడు. కాగా, కున్‌హాట్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ అనే మహిళను జులై 12న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలు శిల్లాయ్ ట్రాన్స్-గిరి ప్రాంతంలో మూడు రోజుల పాటు గ్రాండ్‌గా జరిగాయి. వివాహ వేడుకలో స్థానిక పాటలు, డ్యాన్స్‌లు వేశారు. పెళ్లి సెలబ్రేషన్స్‌లో వందలాది పాల్గొన్నారు.

స్వచ్ఛదంగా చేసుకున్నాం..

ఈ వివాహం తాము సంపూర్ణ స్వేచ్ఛతో చేసుకున్నామని కపిల్ తెలిపాడు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సంప్రదాయాలు బలవంతంగా రుద్దుతారు. కానీ, మా పెళ్లి విషయంలో మమ్మల్ని ఎవరూ బలవంతపెట్టలేదు. ఇది మా ఇద్దరి ఉమ్మడి నిర్ణయం. ఈ విధానంలో భార్యకు ప్రేమ, తగినంత అండతో పాటు ఉమ్మడి కుటుంబం ఏర్పడుతుంది’’ అని కపిల్ వివరించాడు. వార్తల హెడ్‌లైన్స్‌లోకి రావడానికి, లేదా ఫేస్‌బుక్‌ పేజీకి లైక్స్ కోసం తాము ఈ పెళ్లి చేసుకోలేదని, కానీ, పెళ్లికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా పాకిపోయాయని పేర్కొన్నాడు. తాము సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తులమని, ప్రేమతో ఉమ్మడిగా జీవించడమే తమ ఏకైక లక్ష్యమని అన్నదమ్ముళ్లు ఇద్దరూ చెప్పారు. కానీ, కపిల్ విదేశాల్లో పనిచేస్తుండడం గమనార్హం.

Read Also- COVID new variant: గుబులు పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియెంట్.. లక్షణాలు ఇవే!

‘‘మా సంప్రదాయాలు, సంస్కృతిని కొనసాగించేందుకు నేను కట్టుబడి ఉంటాను. మా సంస్కారాల గురించి తెలియని వాళ్లు అర్థం చేసుకోలేరు. ఎవరేం అనుకున్నా మేము మాత్రం వాటిని గౌరవంగా కొనసాగిస్తున్నాం. దయచేసి మాపై తీర్పులు ఇవ్వకండి. మీకు మాదిరిగానే మాకు కూడా జీవించే హక్కు ఉంది. మా జీవితాల విషయంలో మేము సంతృప్తికరంగా ఉన్నాం’’ అంటూ ప్రదీప్ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అన్నదమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారిపోయింది. కొందరు అభినందించగా, మరికొందరు విమర్శలు చేశారు.

హట్టి తెగలో బహుభర్తత్వం

హట్టి తెగలో బహుభర్తత్వం అనాది కాలంగా ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘జజ్డా’ లేదా ‘జోడిదార్’ అని కూడా పిలుస్తుంటారు. వంశపారంపర్యంగా వచ్చిన భూముల విభజనను నియంత్రించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్నట్టు ఆ తెగవారు చెబుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌‌లోని గిరిజన కొండ ప్రాంతాల్లో ఈ ఆచారం చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఈ సంప్రాదాయం సోదరుల మధ్య ఐక్యతను పెంచుతుందని, కుటుంబ బంధాలను బలపరుస్తుందనే విశ్వాసం వారిలో ఉంది. విద్యావంతులు పెరగడం, ఆర్థిక చైతన్యం కారణంగా ఈ సంప్రదాయం ప్రస్తుత కాలంలో కొద్దిగా తగ్గింది. అయితే, హిమాచల్-ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Read Also- Virat – Rohit: విరాట్, రోహిత్ శర్మ ఆశలపై బీసీసీఐ నీళ్లు!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?