Viral Video ( Image Source: Twitter)
Viral

Viral Video: వీడియో డిలీట్ చేయకపోతే అరెస్ట్ చేస్తానని బెదిరించిన బీహార్ పోలీస్ అధికారి.. ఎందుకంటే?

Viral Video: బీహార్‌లో ఒక బైకర్‌ను పోలీసులు ఆపిన సంఘటన పెద్ద దుమారాన్ని రేపుతోంది. బైకర్‌ను బెదిరించి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడి, చెంపదెబ్బ కొట్టిన ఘటన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ మండి పడుతున్నారు. ఇన్‌స్టా360 కెమెరాతో రికార్డ్ చేసిన ఈ వీడియో X (పూర్వంలో ట్విటర్)లో షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో ఒక పోలీస్ అధికారి ఫోన్‌లో బైకర్‌ను బెదిరిస్తూ, వీడియో డిలీట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు.

“ నన్ను కొట్టారు, వాళ్ళు దూషించారు.. అందుకే వీడియో పెట్టా ”  బైకర్ ఆరోపణ

వైరల్ వీడియోలో ‘ఇషూ బోల్ రా’ అని ఒక పోలీస్ అధికారిని తనను పరిచయం చేసుకుంటూ వినిపిస్తాడు. దీనికి బైకర్ కూడా అదే మాటతో స్పందించాడు. వెంటనే ఆ అధికారి, “తూ కాహే వీడియో వైరల్ కియా రె బాబు?” అని ప్రశ్నించాడు. దీనికి బైకర్ స్పందిస్తూ.. “ నన్ను దారుణంగా కొట్టారు. దూషించారు. అలా ప్రవర్తించాక వీడియో పెట్టకుండా ఉండలేకపోయాను ” అని చెప్పాడు.

Also Read: CM Revanth Reddy: సింగపూర్, టోక్యోతో పోటీ పడతాం.. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్

పోలిస్ అధికారి వీడియోను వెంటనే డిలీట్ చేయాలని పదేపదే ఒత్తిడి చేస్తూ.. “జల్దీ డిలీట్ కరో… నహీం తో అబ్ హమ్ అరెస్ట్ కర్నే ఆ రహే” అంటూ బెదిరించాడు. అయితే బైకర్ మాత్రం వీడియోను తొలగించబోనని స్పష్టంగా తెలిపాడు. పోలీస్‌ ఇమేజ్ చెడిపోతుందని అధికారి వ్యాఖ్యానించగా, “ అంతగా దూషణలు చేసిన మీరు మాట్లాడే హక్కు లేదు” అని బైకర్ సమాధానమిచ్చాడు.

Also Read: Manchu Lakshmi: ప్రతిదీ భర్తని అడిగి చెయ్యాలా .. అలా ఏ రాజ్యాగంలో రాసి ఉంది? మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్

వీడియోపై బీహార్ పోలీసులే ట్వీట్ చేశారు..  బైకర్

తాజాగా వైరల్ అవుతున్న 1 నిమిషం 41 సెకన్ల రెండో వీడియోలో బైకర్, అదే పోలీస్ అధికారికి ఫోన్‌లో స్పందిస్తూ.. “బీహార్ పోలీస్ ఇప్పటికే నా వీడియోపై ట్వీట్ చేసింది. మా కమ్యూనిటీ కూడా నన్ను సపోర్ట్ చేస్తోంది” అని తెలిపాడు. అతను ఇంకా మాట్లాడుతూ, వీడియోను తొలగించాలని అనుకున్నా కూడా అది సాధ్యం కాదని, ఎందుకంటే మీడియా పేజీలు, ఇతర సోషల్ మీడియా అకౌంట్‌లు ఇప్పటికే రీపోస్ట్ చేశాయని చెప్పాడు. “ మీడియా, ఇతర అకౌంట్లు వీడియోని పెట్టేశారు. నేను తప్పుగా ప్రవర్తనను ఎదుర్కొన్నానని అందరూ చెబుతున్నారు. కాబట్టి వీడియో డిలీట్ చేసే అవకాశం లేదు” అని చెప్పి కాల్‌ను ముగించాడు.

Also Read: Akhanda2 3D Release: 3డీలో రాబోతున్న బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’.. ఇక ఫ్యాన్సుకు పూనకాలే..

Just In

01

Viral Video: వామ్మో ఇదేం వింత.. కారు మిర్రర్ నుంచి బయటకొచ్చిన పాము.. వీడియో వైరల్

Varanasi title controversy: చిక్కుల్లో రాజమౌళి ‘వారణాసి’ టైటిల్.. అందుకు హనుమంతుడికి కోపం వచ్చిందా!..

Collector Adwait Kumar Singh: ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. సొంత అల్లుడితో సిట్టింగ్.. ఆపై బురదలో కుక్కి చంపిన మామలు

District President: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్!