BCCI
Viral, లేటెస్ట్ న్యూస్

BCCI: బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ.. బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలికి (BCCI) ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2011లో రద్దు చేసిన ఐపీఎల్ మాజీ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్‌ కేరళ (Kochi Tuskers Kerala) యాజమాన్యానికి ఏకంగా రూ.538 కోట్ల అవార్డు  చెల్లించాలంటూ బాంబే హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2015లో మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమర్థించింది. కేవలం ఒకే ఒక్క సీజన్ ఆడిన తర్వాత 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీని బీసీసీఐ రద్దు చేసింది. సకాలంలో బ్యాంక్ గ్యారంటీని సమర్పించకుండా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించారనే కారణాన్ని చూపుతూ  బీసీసీఐ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.

ఒప్పంద ఉల్లంఘనతో తొలగింపు
కొచ్చి టస్కర్స్ కేరళ 2011లో ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్‌లో ఆడింది. కానీ, బ్యాంక్ గ్యారంటీ సకాలంలో సమర్పించలేదని ఆరోపిస్తూ బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందంలో భాగంగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించడం తప్పనిసరి ఉందని, కానీ, సమర్పించకపోవడాన్ని కారణంగా చూపి బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంది.

Read this- Actor Arya: స్టార్ నటుడు ఆర్యకు బిగ్‌ షాక్.. ఇంట్లోకి ప్రవేశించిన ఐటీ అధికారులు

కోర్టు తీర్పు ఇదే

‘‘మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం, ఈ కోర్టు అధికార పరిధి చాలా పరిమితం ఉంటుంది. ఈ వివాదం యోగ్యతను పరిశీలించడానికి బీసీసీఐ చేసిన ప్రయత్నం, చట్టంలోని సెక్షన్ 34 పరిధిలో ఉంటుంది. సాక్ష్యాలు, యోగ్యత కారణాల పట్ల అసంతృప్తితో ఫ్రాంచైజీని బీసీసీఐ రద్దు చేయజాలదు’’ అని జస్టిస్ రియాజ్ తీర్పులో స్పష్టం చేశారు. బీసీసీఐ పిటిషన్‌ను తోసిపుచ్చినట్టు ప్రకటించారు. బీసీసీఐ చూపుతున్న సాక్ష్యాలు, కారణాల ఆధారంగా మధ్యవర్తిత్వ కోర్టు అవార్డును కొట్టివేయలేమని చెప్పారు. బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదనే కారణాన్ని చూపుతూ బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫ్రాంచైజీని రద్దు చేసిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కొచ్చి టస్కర్స్‌ కేరళ యాజమాన్యానికి మొత్తం రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలంటూ 2015లో మధ్యవర్తిత్వ కోర్టు తీర్పునిచ్చింది. కేసీపీఎల్ కంపెనీకి రూ.384 కోట్లు, రెండెన్జ్వస్ స్పోర్ట్‌కు రూ.153 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే, మధ్యవర్తిత్వ కోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పును బాంబే హైకోర్టులో బీసీసీఐ సవాలు చేసింది.

Read this- Ambati Rambabu: అంబటీ.. అస్తమానూ ఈ గోల ఏందబ్బా!

ఆర్బిట్రేటర్ లహోటి రిపోర్టును చూశామని, మధ్యవర్తిత్వ రిపోర్టును సవాలు చేస్తూ అప్పీల్ చేయాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారని నాటి ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పాలక మండలి సమావేశంలో చెప్పారు. చట్టపరమైన అభిప్రాయాన్ని కోరుతున్నామని పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా, ఏకంగా రూ.1,550 కోట్ల భారీ మొత్తంతో కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అయితే, వార్షిక చెల్లింపుల విషయంలో విఫలమైంది. దీంతో, ఒక్క ఏడాదిలోనే అంటే 2011లో ఒప్పందాన్ని బీసీసీఐ రద్దు చేసింది. బీసీసీఐ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ కోర్టులో సవాలు చేసి గెలిచింది. ఫ్రాంచైజీకి బీసీసీఐ రూ.550 కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, కొచ్చి టస్కర్స్ టీమ్ ఆ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. బ్రెండన్ మెకల్లమ్, రవీంద్ర జడేజా, మహేలా జయవర్ధనే, హాడ్జ్‌‌తో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు ఈ ఫ్రాంచైజీ తరపున ఆడారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు