Alekhya Chitti Pickles: మొన్నటి వరకు ఏ సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్ చూసిన అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా వినిపించింది. మీ పచ్చడి రేట్లు ఏంటి మరి ఇంత ఎక్కువగా ఉన్నాయని నార్మల్ గా అడిగినందుకు.. కస్టమర్లు అని చూడకుండా.. పికిల్స్ యజమాని అలేఖ్య బూతులతో పిచ్చిగా పిచ్చిగా తిట్టేసింది.
పచ్చళ్లు గురించి కాకుండా .. వాట్సాప్ లో అసభ్యపదాలు మాట్లాడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం మారు మోగింది. రేటు గురించి అడిగితే వాటి గురించి దాని గురించి మాట్లాడాలి కానీ, బూతులు ఎలా తిడతారంటూ ఆమెపై అందరూ మండిపడ్డారు. అయితే, తాజాగా అలేఖ్య చెల్లి ఇన్స్టా లో రీల్ షేర్ చేసింది .
Also Read: Naini Coal Mine: నైనీ బొగ్గు గని ప్రారంభం.. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు సింగరేణి సిద్ధం!
అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్తా సైలెంట్ అవ్వడంతో ఈ క్రమంలోనే అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య గోపాల్ కంచర్ల ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ లో చేసింది. అయితే, ఈ సారి అల్లు అర్జున్ పాటతో అందర్ని ఆకట్టుకుంటోంది. సరైనోడు చిత్రంలో అతి లోక సుందరి అతి లోక సుందరి అంటూ పాట పాడుతూ డ్యాన్స్ కూడా వేసింది. చీరలో మెరిసి, నడుపు తిప్పుతూ కళ్ళతోనే మాయ చేస్తోంది. రంభ, ఊర్వశి , మేనక రంభ ఊర్వశి మేనక నీకేమైనా రిలేషన్ అవుతారా ఏంటి అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Also Read: Vardhannapet News: ధాన్యం కొనుగోలులో మోసపోకండి.. ప్రభుత్వ ఐకెపి కేంద్రాల్లోనే అమ్మాలని సూచన…
ఈ వీడియో పై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో మొదలెట్టిందిరా మళ్లీ అంటూ కౌంటర్స్ ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు, ఈ రీల్స్ ఆపి కొత్త బిజినెస్ మొదలు పెట్టండి. దీంతో, ఏం రాదు.. పికిల్స్ అమ్మితే డబ్బులు అయిన వస్తాయని సలహా ఇస్తున్నారు. ఇంకొందరు, పికిల్స్ బిజినెస్ ఆపి సినిమాలో హీరోయిన్ గా ట్రై చేయండి , మేము సపోర్ట్ చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram