Vardhannapet News: దళారులను నమ్మి మోసపోవద్దు, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, వర్ధన్నపేట పీఎసీఎస్ చైర్మన్ రాజేశ్ ఖన్నా లు తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం, ల్యాబర్తి , వెంకట్రావుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి దాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరతో పాటు, సన్నాలకు బోనస్ పొందాలని రైతులకు వారు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు దొడ్డు రకం ధాన్యానికి రూ,2300, సన్న రకం ధాన్యాన్ని రూ.2320 కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు క్వింటాలకు రూ500/- బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కావున రైతులు మధ్యదళారులకు అమ్ముకోని మోసపోవద్దు ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమ ములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డి,మాజీ జడ్పీటీసీ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రతి బాను ప్రసాద్,జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి,ఎండీ వలి పాషా,యూత్ నాయకులు ప్రశాంత్, అడ్డగట్టా రాములు,మహిళా నాయకురాలు బండ సరిత తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు