Food Facts: జాగ్రత్తగా తినాల్సిన హెల్తీ ఆహారాలు ఇవే..
Food Facts ( Image Source: Twitter)
Viral News

Food Facts: ఆరోగ్యానికి మంచివే కానీ ఎక్కువైతే విషమం.. ఈ ఫుడ్ ఐటమ్స్ తో జాగ్రత్త!

Food Facts: సాధారణంగా మనకీ ఇష్టమై ఫుడ్ ను ఒకటి కంటే ఎక్కువ సార్లు తింటాము. ఇంకొందరైతే వారంలో మూడు సార్లు తింటారు. అయితే, ఇవి మితంగా తింటే ఓకే. మితి మీరి తింటే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు, చక్కెర, కొవ్వులు ఉన్న ఆహారం ఊబకాయం, హార్ట్ డిసీజ్‌, డయాబెటిస్‌లకు కారణమవుతాయని తెలుసు. కొన్ని “హెల్తీ ఫుడ్‌”లు కూడా ఎక్కువ తింటే హానికరమవుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

“ఏదైనా మంచి ఆహారం ఎక్కువగా తినడం అంటే అది ఎక్కువ తినడం మంచిది కాదు. సమతుల ఆహారం చాలా ముఖ్యం.”

1. దాల్చిన చెక్క (Cinnamon)

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇందులో కూమరిన్‌ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే లివర్‌పై దుష్ప్రభావాలు చూపి, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రిస్క్‌ను కూడా పెంచుతుంది. సాధ్యమైనంత వరకు సిలోన్ దాల్చిన చెక్క (Ceylon Cinnamon) వాడటం మంచిది, ఎందుకంటే కాసియా దాల్చిన చెక్కలో కూమరిన్ ఎక్కువగా ఉంటుంది.

Also Read: First Date Ideas: ఫస్ట్ డేట్‌లో మీ ప్రియమైనవారిని ఇంప్రెస్ చేయాలా? ఈ అద్భుత ఐడియాలు మీ కోసమే!

2. కాఫీ (Coffee)

కాఫీ అనేది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే ఆరోగ్యకరమైన పానీయం. ఇది లివర్ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్‌, న్యూరోలాజికల్ సమస్యలను తగ్గిస్తుంది. అయితే, కాఫీలో ఉండే కెఫిన్(Caffeine) అధిక మోతాదులో తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, హార్ట్ పల్సేషన్‌లు కలగవచ్చు. కాబట్టి రోజుకు 3-4 కప్పులు కాఫీ తీసుకోండి. చక్కెర లేకుండా తాగితే మరింత ఆరోగ్యకరం.

3. జాజికాయ (Nutmeg)

జాజికాయ కూడా దాల్చిన చెక్కలాగే యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే ఇది మైరిస్టిసిన్‌ (Myristicin) అనే టాక్సిక్ పదార్థాన్ని విడుదల చేస్తుంది. దీని వల్ల తలనొప్పి, గుండె వేగం పెరగడం, మలబద్ధకం, మూర్ఛ లేదా హాల్యుసినేషన్స్‌ రావచ్చు. వంటలలో కూడా దీనిని తక్కువ పరిమాణంలోనే వాడాలి.

Also Read: Naagin 7 First Look : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న నాగిన్ 7 ఫస్ట్ పోస్టర్ లుక్ రిలీజ్.. ఈ సారి నాగినిగా ఎవరంటే?

4. బ్రోకోలీ & క్రూసిఫెరస్ వెజిటబుల్స్ (Broccoli and Other Cruciferous Vegetables)

బ్రోకోలీ, కాలీఫ్లవర్‌, కేల్‌, క్యాబేజీ, బోక్ చోయ్ వంటి కూరగాయల్లో విటమిన్లు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌, హార్ట్‌ డిసీజ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. కానీ వీటిలో ఉండే థియోసయనేట్స్‌ (Thiocyanates) అనే పదార్థాలు ఐయోడిన్‌ శోషణను తగ్గించి, థైరాయిడ్‌ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. థైరాయిడ్‌ తో బాధ పడేవారు వారానికి 2-3 కప్పులు మాత్రమే తీసుకోవాలి. వీటిని స్టీమ్‌, రోస్ట్‌ లేదా సూటే చేయడం ద్వారా ప్రమాదం తగ్గుతుంది.

గమనిక: పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

CPI Hyderabad: 100 ఏళ్ల సిపిఐ వేడుకలు.. జెండాలతో కళకళలాడిన నగరం!

Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే