First Date Ideas: చాలా మందికి ఫస్ట్ డేట్ అంటే కొంచం భయం ఉంటుంది. అంటే కొందరికి ఎగ్జైటింగ్‌గా, కొంత నర్వస్‌గా ఉంటుంది. ఎవరినైనా మొదటిసారి కలిసేటప్పుడు మంచి ఇంప్రెషన్ ఉండటం అని ముఖ్యమని ఫీల్ అవుతారు. చర్చను మరి సీరియస్ గా కాకుండా, కొంచెం నవ్వులు పంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, ఇక్కడే ఉంది ఒక మ్యాజిక్ సీక్రెట్. మీరు ఎలాంటి ప్రశ్నలు అడగాలో ముందుగానే ప్రిపేర్ అవ్వడం మంచిది. చిన్న మాటలకే పరిమితం కాకుండా, ఈ క్యూట్ ప్రశ్నలు మీ డేట్‌తో ఫన్‌గా, డీప్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చిన్న ప్రశ్నలతో పెద్ద కనెక్షన్ క్రియేట్ చేయొచ్చు..
1. నీకు ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ ఏది?
ఇదొక ఒక స్వీట్ స్టార్టర్. వాళ్ల ఫుడ్ టేస్ట్ గురించి తెలుసుకోవటమే కాక, భవిష్యత్తులో డిన్నర్ ప్లాన్స్‌కి కూడా ఇది హింట్ అవుతుంది.
2. ఎలాంటి జంతువునైనా దత్తత తీసుకోవచ్చని అనుకుంటే, ఏది తీసుకుంటావు?
ఇది ఇమాజినేటివ్, ఫన్ క్వశ్చన్. వాళ్ల పర్సనాలిటీ గురించి తెలుసుకోవడానికి పర్ఫెక్ట్.
Also Read: Gadwal Crime: పోలీసుల అదుపులో మోసాలకు పాల్పడుతున్న బంగారం వ్యాపారి.. మరో ఘటనలో బంగారం కోసం మహిళ హత్య
3. చిన్నప్పుడు నీకు ఇష్టమైన కార్టూన్ షో ఏది?
నాస్టాల్జియా టాపిక్స్ ఎప్పుడూ హిట్ అవుతాయి. చైల్డ్‌హుడ్ మెమరీస్ షేర్ చేసుకోవడం రిలాక్స్‌డ్ వైబ్ ఇస్తుంది.
4. ఇప్పటివరకు నువ్వు చేసిన మోస్ట్ స్పాంటేనియస్ పని ఏది?
వాళ్లలోని అడ్వెంచరస్ సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇది చర్చకు ఎంటర్టైనింగ్ టర్న్ ఇస్తుంది.
5. ఫస్ట్ సైట్‌లో లవ్ నమ్ముతావా?
చిన్న ఫ్లర్టీ టచ్‌తో హాస్యంగా ఉండే ప్రశ్న ఇది.. వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.
6. నీ డ్రీమ్ వీకెండ్ ఎలా ఉండాలి?
మూవీస్, ట్రావెల్, కాఫీ షాప్స్.. వాళ్లు ఎలా రిలాక్స్ అవుతారో ఇది చెప్పేస్తుంది.
7. నీకు చిరునవ్వు తెప్పించే విషయాలు ఏవి?
ఇది హార్ట్‌వార్మింగ్ టాపిక్. అవతలి వాళ్ల ఎమోషనల్ సైడ్ గురించి తెలుసుకోవచ్చు.
8. నీ లైఫ్ ఒక సినిమా అయితే, ఏ జానర్‌లో ఉంటుంది?
క్రియేటివ్‌గా, లైట్‌గా మాట్లాడడానికి ఇది బెస్ట్ క్వశ్చన్.
9. నీకు ఏదైనా హిడెన్ టాలెంట్ లేదా క్యూట్ హాబీ ఉందా?
ఇది ఫన్ మోమెంట్స్‌కి దారి తీస్తుంది. ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వస్తాయి.
10. నీ డ్రీమ్స్ లిస్ట్‌లో ఇంకా చేయని ఒక విషయం ఏది?
డ్రీమ్స్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చర్చ మొదలుపెట్టడానికి ఇది ఐడియల్ టాపిక్.
