Naagin 7 First Look : సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 19 లో నాగిన్ 7 గురించి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సీరియల్ హిందీలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో టెలివిజన్ రాణి ఏక్తా కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసింది. అయితే, ఆమె తీసిన వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ ” నాగిన్ 7 ” ను పరిచయం చేసింది. బిగ్ బాస్ 16 ఫైనలిస్ట్ , టెలివిజన్ నటి ప్రియాంకా చహార్ చౌదరి ఈ సీజన్‌లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అంటే ఈ సీరియల్లో కొత్త నాగినిగా, రూపం మార్చుకునే సర్పిణిగా నటించబోతున్నారు. ప్రియాంకా ఎంట్రీ సందర్భంగా స్టేజ్‌పై అందరినీ ఆకట్టుకునేలా డ్యాన్స్ చేస్తూ, హోస్ట్ సల్మాన్ ఖాన్ , ఏక్తా కపూర్‌లతో కలిసి స్టేజ్‌పై నిలిచారు. బిగ్ బాస్ 19 లో ఫేస్ రివీల్ చేసిన తర్వాత ‘నాగిన్ 7’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ అవకాశంపై తన ఆనందాన్ని వ్యక్త పరస్తూ ప్రియాంకా మాట్లాడుతూ.. “ బిగ్ బాస్ 16లో ఏక్తా మేడం ‘ నా నెక్స్ట్ నాగినిని నేను కనుగొన్నాను’ అని చెప్పిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టి, నన్ను ఈ లెగసీ కోసం ఎంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పాత్రలు నటుడి శక్తిని, పరిధిని, ఆత్మను పరీక్షిస్తాయి. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం కూడా అలాంటిదే.. ” అని అన్నారు.
ఇప్పటి వరకు నాగిన్ సిరీస్ లో నటించిన నటీ నటులు వీళ్ళే..
నాగిన్ బాలాజీ టెలీఫిలిమ్స్ పతాకం పై ఏక్తా కపూర్ నిర్మించిన సూపర్‌నేచురల్ ఫిక్షన్ సిరీస్. ఈ సిరీస్ 2016లో మొదలైంది.
సీజన్ 1: మౌని రాయ్, అర్జున్ బిజ్లానీ, అదా ఖాన్ ను నటించారు.
సీజన్ 2: మౌని రాయ్, కరణ్‌వీర్ బోహ్రా, అదా ఖాన్, సుధా చంద్రన్ నటించారు.
సీజన్ 3: సురభి జ్యోతి, పర్ల్ వి పురి, అనితా హసనందాని నటించారు.
సీజన్ 4: నాగిన్ – భాగ్య కా జహ్రీలా ఖేల్ పేరుతో – నియా శర్మ, విజయేంద్ర కుమేరియా, జస్మిన్ భాసిన్, రష్మీ దేశాయ్ నటించారు.
సీజన్ 5: సురభి చందనా, శరద్ మల్హోత్రా, మొహిత్ సెహగల్ నటించారు.
సీజన్ 6: తేజస్వి ప్రకాశ్, సింబా నాగ్పాల్, మాహెక్ చహల్, ప్రతీక్ సెహజ్‌పాల్, శ్రేయ మిట్టల్, వత్సల్ శేఠ్ నటించారు.
ఇప్పుడు, నాగిన్ 7లో ప్రియాంకా చహార్ చౌదరి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ కొత్త సీజన్ నవంబర్ 2025లో ప్రసారం కానుంది.
