Home Decor Essentials: ఇల్లు ఎంత అందంగా, చక్కగా ఉంటే మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. గంటల కొద్ది ఆఫీసుల్లో కుస్తీలు పడేవారు.. మంచి వాతావరణం కలిగిన ఇంట్లోకి అడుగుపెట్టగానే వారి ఒత్తిడి, అలసట దూరమైపోతాయని అంటుంటారు. అయితే చాలా మంది ఇంటిని అందంగా తీర్చుదిద్దుకోవడంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలాంటి డెకరెషన్ ఐటెమ్స్ పెడితే ఇల్లు అందంగా, సౌఖర్యవంతంగా మారుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారి కోసం టాప్ – 5 డెకర్ ఎలిమెంట్స్ టిప్స్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాటిని ఫాలో అయితే మీ ఇల్లు మరింత అందంగా మారడంతో పాటు.. కొత్త అనుభూతిని పొందవచ్చు.
మృదువైన లైటింగ్
వెచ్చని, మృదువైన లైటింగ్ (వార్మ్ టోన్డ్ లాంప్స్ లేదా ఫెయిరీ లైట్స్) ఇంటిలో అహ్లాదకరమైన, శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. డిమ్మబుల్ లైట్స్ లేదా క్యాండిల్స్ ఉపయోగించడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
సహజ ఎలిమెంట్స్
ఇండోర్ మొక్కలు, చెక్క ఫర్నిచర్ లేదా స్టోన్ డెకర్ వంటి సహజ అంశాలు ఇంటికి ప్రశాంతతను తెస్తాయి. మొక్కలు గాలిని శుద్ధి చేసి, ఒత్తిడిని తగ్గిస్తాయి.
సౌకర్యవంతమైన టెక్స్‌టైల్స్
మెత్తని కుషన్స్, బ్లాంకెట్స్, రగ్గులు లేదా వెల్వెట్ కర్టెన్స్ వంటివి ఇంటికి వెచ్చదనం, సౌకర్యాన్ని జోడిస్తాయి. ఇవి స్పర్శకు హాయిని కలిగిస్తాయి.
ఫ్యామిలీ ఫొటోల గ్యాలరీ
కుటుంబ ఫోటోలు, ఆర్ట్‌వర్క్ లేదా హాబీలకు సంబంధించిన డెకర్ వస్తువులు మీ ఇంటితో బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి ఆనందంతో పాటు కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను రోజు రోజుకు పెరిగేలా చేస్తాయి.
Also Read: Vishwambhara: చిరుతో జతకట్టిన బాలీవుడ్ బ్యూటీ.. విశ్వంభర సెట్‌లో రచ్చ రంభోలా!
అవసరమైన ఫర్నిచర్ లేఅవుట్
స్థలాన్ని ఆప్టిమైజ్ చేసే ఫర్నిచర్ అమరిక ఇంటిని విశాలంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. ఓపెన్ స్పేస్, సరైన సీటింగ్ ఏర్పాటు మానసిక శాంతిని కలిగిస్తాయి.