OTT Platforms
జాతీయం, లేటెస్ట్ న్యూస్

OTT Platforms: 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

OTT Platforms: వీక్షకులకు అశ్లీల, అసభ్యకర, అవాంఛనీయమైన కంటెంట్‌ అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఈ తరహా ఓటీటీ ప్లా్ట్‌ఫామ్స్‌పై మరింత పకడ్బంధీగా నిఘా పెట్టడమే లక్ష్యంగా 25 ఓటీటీ యాప్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్లు (Ullu), ఆల్ట్ (ALTT), దేశీఫ్లిక్స్ (Desiflix) వంటి ఆదరణ ఉన్న యాప్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ యాప్‌లను జనాలకు అందుబాటులో ఉంచవద్దంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPs) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ తరహా కంటెంట్‌ను అదుపు చేసే బాధ్యత మధ్యవర్తులుగా వ్యవహరించే ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2021, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 (ఇంటర్మీడియెటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను జనాలకు అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా, తొలగించాల్సి ఉంటుందని పేర్కొంది. భారతీయ న్యాయవ్యవస్థ, భారతీయ సాంస్కృతిక విలువలకు విరుద్ధంగా ఉండే అసభ్యకరమైన కంటెంట్ వ్యాప్తిని అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని నోటిఫికేషన్‌‌లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది.

నిషేధిత యాప్స్ ఇవే
బిగ్ షాట్స్ (Big Shots App), బూమెక్స్ (Boomex), నవరస లైట్ (Navarasa Lite), గులాబ్ యాప్ (Gulab App), కంగణ్ (Kangan App), బుల్ యాప్ (Bull App), జల్వా (Jalva App), వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Wow Entertainment), లుక్ ఎంటర్‌టైన్‌మెంట్ (Look Entertainment), హిట్‌ప్రైమ్ (Hitprime), ఫెనియో (Feneo), షోఎక్స్ (ShowX), సోల్ టాకీస్ (Sol Talkies), అడ్డా టీవీ (Adda TV), హాట్‌ఎక్స్ వీఐపీ (HotX VIP), హల్‌చల్ యాప్ (Hulchul App), మూడ్‌ఎక్స్ (MoodX), నియాన్‌ఎక్స్ వీఐపీ (NeonX VIP), ఫ్యూజీ (Fugi), మోజ్‌ఫ్లిక్స్ (Mojflix), ట్రిఫ్లిక్స్ (Triflicks).

Read Also- Health: మసాలాలు ఎక్కువ తింటే అల్సర్ వస్తుందా?.. అసలు నిజాలు ఇవే

చట్టాల ఉల్లంఘన..
నిషేధిత యాప్స్‌ వివిధ భారతీయ చట్టాలలోని నిబంధనలను ఉల్లంఘించాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ముఖ్యంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000లోని సెక్షన్ 67, 67ఏ, భారతీయ న్యాయ సంహిత (BNS)-2023లోని సెక్షన్ 294, అసభ్యకరరీతిలో మహిళల ప్రాతినిధ్య నిషేధిత చట్టం-1986లోని సెక్షన్ 4లను ఉల్లంఘించినట్టు పేర్కొంది. నిషేధిత ప్లాట్‌ఫామ్స్ చట్టవిరుద్ధంగా అభ్యంతరకరమైన, అశ్లీలమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ధారించింది. అందుకే, ఈ తరహా కంటెంట్ నిషేధానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత యాప్‌లు, వెబ్‌సైట్లు భారతదేశ ప్రజలకు అందుబాటులో ఉండకుండా తొలగించాలని క్లారిటీగా చెప్పింది.

Read Also- Team India: ఇంగ్లండ్‌తో నాలుగవ టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్‌కు పిలుపు?

ఈ ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేయడంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సాయం చేయాలంటూ టెలికమ్యూనికేషన్ విభాగంలోని డైరెక్టర్‌కు కూడా లేఖ రాసింది. డిజిటల్ కంటెంట్ నియంత్రణపై అనుసరిస్తున్న కఠిన వైఖరికి ఈ నిర్ణయం ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. నిజానికి ఓటీటీలు, సోషల్ మీడియాలో లైంగికపరమైన కంటెంట్‌పై నిషేధం విధించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన న్యాయస్థానం ఇది తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. అయితే, సాధ్యమైన ఏమైనా చర్యలు తీసుకోవాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది.

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే