Vishwambhara: చిరుతో బాలీవుడ్ బ్యూటీ.. సెట్‌లో రచ్చ రంభోలా!
Viswambhara (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్, లేటెస్ట్ న్యూస్

Vishwambhara: చిరుతో జతకట్టిన బాలీవుడ్ బ్యూటీ.. విశ్వంభర సెట్‌లో రచ్చ రంభోలా!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. సినిమాకు యువ దర్శకుడు మల్లిడి విశిష్ట తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పేలవమైన వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో బాలీవుడ్ అందాల భామ చేసినట్లు తెలుస్తోంది. చిరుతో గ్రేస్ ను మ్యాచ్ చేస్తూ ఆ అమ్మడు దుమ్ముదూలిపిందని సమాచారం.

సాంగ్ షూట్ మెుదలైందోచ్!
చిరు హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఇవాళ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నగరంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక గీతం కోసం ఏర్పాటు చేసిన సెట్ లో ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ అందిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్.. చిరుతో కలిసి స్టెప్పులు సైతం వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా చెబుతూ తన ఇన్ స్టాగ్రామ్ ఫొటోలను సైతం ఈ అమ్మడు షేర్ చేయడం గమనార్హం. కాగా నాలుగు రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరగనున్నట్లు సమాచారం.

ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్
మెగా ఫ్యాన్స్ ఎగిరిగంతేసేలా ఈ సాంగ్ ఉండనున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మ్యూజిక్ కంపోంజింగ్, డ్యాన్స్ స్టెప్పుల విషయంలో మూవీ టీమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరు కెరీర్ లోని పలు సూపర్ హిట్ సాంగ్స్ రిఫరెన్స్ లు ఈ పాటలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మౌనీ రాయ్, చిరు మధ్య వచ్చే స్టెప్పులు నెక్ట్స్ లెవల్లో ఉంటాయని.. అభిమానులకు గ్రాండ్ ట్రీట్ ను ఇస్తాయని కూడా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే విశ్వంభర చిత్రంలో ప్రత్యేక పాటను జోడించడం వెనక ఓ బలమైన కారణమే ఉందన్న ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా అభిమానుల్లో రోజు రోజుకు ఇంట్రెస్ట్ తగ్గిపోతోందని మూవీ మేకర్స్ భావించారట. ఈ నేపథ్యంలో ప్రత్యేక గీతాన్ని సినిమాలో యాడ్ చేస్తే.. తిరిగి ఫ్యాన్స్ లో జోష్ తీసుకొని రావొచ్చని భావించినట్లు తెలుస్తోంది.

Also Read: Baby Skin Care Tips: వర్షాకాలంలో శిశువు చర్మ రక్షణ.. 5 ప్రధాన సమస్యలు.. వాటి పరిష్కారాలు!

దసరాకు రిలీజ్?
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న విశ్వంభర.. ఐకానిక్ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరు మరో చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు) సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read This: NASA Engineers: అంతరిక్షంలో నాసా అద్భుతం.. తెలిస్తే కచ్చితంగా షాకవుతారు..!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం