Viral Video: రీల్స్ పిచ్చి.. కళ్లముందే కొట్టుకుపోయిన యూట్యూబర్!
Viral Video (Image Source: twitter)
Viral News

Viral Video: రీల్స్ కోసం వెర్రి వేషాలు.. కళ్లముందే కొట్టుకుపోయిన యూట్యూబర్!

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతున్నారు. లైక్స్, షేర్స్ కోసం తమను తాము ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
బెరహంపూర్‌ (Berhampur)కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ సాగర్ కుందు (Sagar Kundu).. డుడుమా జలపాతం (Duduma waterfalls)లో కొట్టుకుపోతున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి దిగి.. వీడియో చేసేందుకు సాగర్ ప్రయత్నించాడు. నీటి ఉద్దృతి ఎక్కువగా ఉందని.. బయటకు రావాలని తోటి స్నేహితులు సూచించినప్పటికీ సాగర్ వినలేదు. ఈ క్రమంలోనే అందరూ చూస్తుండగానే అతడు నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 23) జరిగినప్పటికీ ఇప్పటివరకూ సాగర్ జాడ తెలియలేదు.

Also Read: Nara Lokesh: స్త్రీ శక్తికి కొత్త శక్తి.. ర్యాపిడోతో రాణిస్తున్న మహిళ.. నారా లోకేషే ఫిదా అయ్యారు!

సాగర్ సంచి గుర్తింపు.. కానీ
ఘటన జరిగిన సమయంలో సాగర్ లైవ్ వీడియో చిత్రీకరిస్తున్నాడు. నీటి మట్టం పెరుగుతోందని స్నేహితులు హెచ్చరిస్తున్నప్పటికీ వినకుండా అతడు నీటి మధ్యలోకి వెళ్లాడు. నీటి ప్రవాహానికి కాళ్లు స్లిప్ అవ్వడంతో అతడు కొట్టుకుపోయినట్లు స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఘటనపై మాచ్కుంద్ పోలీసులు స్పందించారు. ‘ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక గ్రామస్తులు కలిసి ఆదివారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. సాయంత్రం వారికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతడి ఆచూకి దొరకలేదు. అతడి వినియోగించిన సంచి అందులోని బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే గుర్తించగలిగాం’ అని పోలీసు అధికారి మధుసూదన్ భోయ్ తెలిపారు.

Also Read: CM Revanth Reddy: ఏం కావాలో రాసి పెట్టుకోండి.. మీ వద్దకే వచ్చి జీవోలు ఇస్తా.. సీఎం బంపరాఫర్!

ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందంటే?
శనివారం మధ్యాహ్నం తోటి యూట్యూబర్ అభిజిత్, స్నేహితులతో కలిసి కటక్ జోబ్రా ప్రాంతానికి సాగర్ వెళ్లాడు. వారు డ్రోన్ షాట్లు సహా పలు ప్రదేశాల్లో వీడియోలు తీశారు. అయితే సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సాక్షుల ప్రకారం ఇతరులు ఒడ్డునే ఉండగా సాగర్ హెచ్చరికలను లెక్కచేయలేదు. స్నేహితులు తాడు విసిరి అతన్ని పైకి లాగడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. కొద్ది నిమిషాల్లోనే ఆనకట్టవైపు నుండి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి వారి కళ్లముందే అతడు నీటిలో కొట్టుకుపోయాడు. తమ గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Viral Video: రెజ్లింగ్ మ్యాచ్‌లో ఊహించని ఘటన.. వణుకుపుట్టిస్తున్న వీడియో!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..