Little Hearts: మౌళి తనూజ్ (Mouli Tanuj), శివానీ నాగరం (Shivani Nagaram) జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు (అనుష్క ‘ఘాటి’, శివకార్తికేయన్ ‘మదరాసి’) పోటీగా వచ్చినా, ఆ రెండు సినిమాలకు రాని కలెక్షన్లను ఈ చిన్న సినిమా రాబడుతోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఇంకా హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతూ.. రోజురోజుకూ థియేటర్లను పెంచుకుంటుంది. తాజాగా ఈ సినిమా 3 రోజుల్లో కలెక్ట్ చేసిన కలెక్షన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ కలెక్షన్ల ప్రకారం ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ దశకు చేరుకుంది. నెక్ట్స్ బ్లాక్ బస్టర్ లిస్ట్‌లోకి చేరేందుకు దూసుకెళుతోంది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో, నిర్మాతలకు ఈ సినిమా భారీగా లాభాలను తెచ్చిపెడుతుందని ట్రేడ్ రిపోర్ట్స్ సైతం చెబుతున్నాయి.
Also Read- Nandamuri Balakrishna: అక్కడ బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా బాలయ్య రికార్డ్!
3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ (Sai Marthand) రూపొందించిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, చిన్న చిత్రాల్లో హ్యూజ్ సక్సెస్ అందుకుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటున్న ఈ సినిమా 3 రోజులకుగానూ రూ. 12.21 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరిగిందని, ఆ అమౌంట్‌ను విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రాబట్టిందని, ఈ మధ్యకాలంలో విడుదలైన రోజే బ్రేకీవెన్ సాధించిన చిత్రం ఇదేనంటూ టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, సెలబ్రిటీలెందరో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుటుంబంతో కలిసి చూసే చిత్రంగా అభివర్ణిస్తూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read- Trisha: విజయ్ పొలిటికల్ పార్టీపై త్రిష ఆసక్తికర కామెంట్స్.. ఏదో తేడాగా ఉందేంటి?
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ప్రశంసలు
తాజాగా ఈ సినిమాపై ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మూవీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ (Tourist Family director Abhishan Jeevinth) ప్రశంసలు కురిపించారు. ‘‘లిటిల్ హార్ట్స్ సినిమాను చూశాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన క్యూట్ ఫన్ మూవీ ఇది’’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇంతకు ముందు విజయ్ దేవరకొండ, మంచు మనోజ్, ఆనంద్ దేవరకొండ వంటి వారంతా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అయిన బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ వంటి వారు ఈ చిత్రంలో ఇతర పాత్రలలో నటించారు.
Watched Little Hearts. a cute, fun-filled film that’s perfect to enjoy with your friends and family ! 😂💥@Mouli_Talks @marthandsai
— Abishan Jeevinth (@Abishanjeevinth) September 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు