Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. ఇంక ఎప్పటిలానే మళ్లీ మొదలు.. ఒకరికొకరికి గొడవలు పెట్టడం .. లవ్ ట్రాక్ నడిపించడం.. ఈ సారి అయితే .. మొదటి రోజు నుంచే ఆట మొదలు పెట్టేశారు. ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి.. తమ పంచులు, మాటలు, డైలాగ్‌లతో అందర్ని అలరిస్తున్నారు. హరీష్ మాస్క్ మ్యాన్‌గా సింగిల్ హ్యాండెడ్‌గా మార్కులు కొట్టేశాడు. కానీ, ఎపిసోడ్ మొత్తంలో అతడే హైలైట్ గా నిలిచాడు.
ఎందుకంటే మధ్యలో ఒక చిన్న రొమాంటిక్ సీన్ వచ్చి, అందర్ని టీవీలను ముందు అతుక్కుపోయేలా చేసింది. మన జబర్దస్త్ క్వీన్ రీతూ చౌదరి, డే 1 నుంచే లవ్ ట్రాక్ మొదలెట్టేసింది. ఎవరితోనా? అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదండి జవాన్ హీరో పవన్ కళ్యాణ్‌తో.
సింపుల్ గా గేమ్ ఆడదామని చెప్పి, బుట్టలో దించాలని ప్లాన్ చేసింది. కానీ, పవన్ మాత్రం పడకుండా స్ట్రాంగ్ గా నిలిబడ్డాడు. ఈ సీన్ ఎపిసోడ్‌లో ఇదే హైలైట్ గా నిలిచింది. బిగ్ బాస్ షోకు ప్రతి ఒక్కరినీ అట్రాక్ట్ చేయడానికి కొన్నింటిని వాడతాడు. హౌస్‌లో గొడవలు, కొట్లాటలు, మధ్యరాత్రి గుసగుసలు, చిన్న చిన్న రొమాన్స్‌లు, లవ్ ట్రాక్‌లు, అలకలు, కులుకులు.. వీటిని కొత్తగా ప్లాన్ చేసి అందర్ని అలరిస్తాడు.
గత సీజన్‌లో సోనియా-పృథ్వీ-నిఖిల్ ట్రయాంగిల్ లవ్ అందరినీ క్రేజీ చేసింది. తర్వాత విష్ణు ప్రియ-పృథ్వీ ట్రాక్ ఒక రేంజ్‌లో రన్ అయింది. ఇప్పుడు ఈ సీజన్‌లో కొత్త లవ్ కపుల్ ఎవరు? అంటూ అందరూ వెయిట్ చేస్తుండగా, “నేను ఉన్నాను వస్తున్నా!” అంటూ రీతూ చౌదరి అప్పుడే మొదలు పెట్టింది. డే 1 ఎపిసోడ్‌లో, కామనర్ జవాన్ పవన్ కళ్యాణ్‌తో ” ఒక గేమ్ ఆడదామా?” అని అడిగి, అతడిని ఒప్పించింది. “ఏదో చిన్న గేమ్” అనుకుని పవన్ ఆడటానికి ఒప్పుకుంటాడు. “కళ్లు ఆర్పకుండా ఒకరినొకరు ఎంతసేపు చూస్తాం?” అని రీతూ అడుగుతుంది. దానికి పవన్ “ఓకే!” అని గేమ్ ఆడుతాడు. వీరి గేమ్ చూడటానికి మిగతా హౌస్ మేట్స్ చుట్టు ముడతారు.