Allu Aravind: అల్లు అరవింద్ ఇంట రీసెంట్‌గా వాళ్ల అమ్మగారు కనకరత్నమ్మగారు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ మరణ వార్త మరువక ముందే అల్లు అరవింద్‌ను మరో విషాదకర సంఘటన వెంటాడింది. ఆయన స్నేహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి. నాగరాజు (C. Nagaraju) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. వరస సంఘటనలతో అయిన వారిని కోల్పోవడంతో అల్లు అరవింద్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లుగా అల్లు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సి. నాగరాజు అంటే అల్లు అరవింద్‌కు ఎంతో ఇష్టమని, ఆయన తన చిన్ననాటి స్నేహితుడు (Allu Aravind Childhood Friend) కూడా కావడంతో.. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న అల్లు అరవింద్, వెంటనే ఇలా స్నేహితుడి మరణ వార్త వినాల్సి రావడంతో విషాదంలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది.
ఫ్యామిలీ మెంబర్‌గానే చూసేవారు..
సి. నాగరాజును అల్లు అరవింద్ కేవలం స్నేహితుడిగానే చూడకుండా తన ఫ్యామిలీ మెంబర్‌గానే చూసేవారట. తన స్నేహితుడు అంటే అల్లు అరవింద్‌కు ఎంత ఇష్టమంటే.. ఎక్కడో ఉన్న ఆయనను, ఆయన ఫ్యామిలీని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, తన కళ్ల ఎదుటే ఉండేలా చూసుకున్నారని, తన గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా అప్పటి నుంచి ఆయనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా స్థానం కల్పించారని చెబుతుంటారు. ప్రస్తుతం తల్లి మరణంతో ఇంటి నుంచి కదలలేని ఆయన.. స్నేహితుడి అంత్యక్రియలను తన పర్సనల్ స్టాఫ్ దగ్గరుండి చూసుకునేలా నియమించారని తెలుస్తోంది. ఇప్పుడా ఫ్యామిలీ బాధ్యతలను కూడా అల్లు అరవిందే తీసుకున్నట్లుగా సమాచారం. కాగా, నాగరాజుకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు నాగరాజు అంత్యక్రియలకు హాజరైనట్లుగా తెలుస్తోంది.
Deeply saddened by the demise of C. Nagaraju Garu (@GeethaArts). A true gentleman with a humble soul, he always celebrated my success as his own. His loss is a personal one for me, and he will always be remembered in my heart.
May God give strength to his family during this… pic.twitter.com/X8fiCkk63m
— Sreenu Vaitla (@SreenuVaitla) September 7, 2025
Also Read- OTT Movies: ఓటీటీ లవర్స్ కి పండగే.. ఆ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి.. చూసేందుకు మీరు సిద్ధమేనా?
తల్లి పెద్దకర్మలో.. (Kanakaratnamma Pedda Karma)
అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ మదర్, చిరంజీవి అత్తగారైన అల్లు కనకరత్నమ్మ (94) ఆగస్ట్ 30వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. అల్లు, మెగా కుటుంబాల అశ్రు నయనాలతో ఆమెను సాగనంపారు. సోమవారం (సెప్టెంబర్ 8)న అల్లు అరవింద్ తన మదర్ కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) పెద్దకర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి ప్రముఖులెందరో హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమంలో ఎక్కువ సేపు ఉండలేదు. ఆయన వచ్చి నివాళులు అర్పించి వెంటనే వెళ్లిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి, కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు