OTT Movies: ప్రతి వారం ఓటీటీలో ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ వారం రెండు హిట్ సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
” కూలీ ” చిత్రం
రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆగస్టు 14, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున (విలన్ పాత్రలో), అమీర్ ఖాన్ (స్పెషల్ క్యామియో), ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే (స్పెషల్ సాంగ్), సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్ 2 కి గట్టి పోటీ ఇచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మొత్తం రూ.500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 11 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.
” సైయారా ” చిత్రం
సైయారా (Saiyaara) సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. 2025లో రిలీజైన భారతీయ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 18, 2025న రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. మొదటి మూడు రోజుల్లో రూ.100 కోట్లు సాధించింది. నటీనటుల నటన, మోహిత్ సూరి దర్శకత్వం, సంగీతం పై ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12 న నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కానుంది.