Trisha: ఈ మధ్య త్రిష పెళ్లి గురించి వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఏంటి? ఎప్పటి నుంచో ఆమె పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. శింబు, రానా.. ఇలా హీరోల పేర్లు చాలానే త్రిష పెళ్లి (Trisha Marriage) విషయంలో వినిపించాయి. ఇక ఈ మధ్య కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay)తో త్రిష డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. అదే సమయంలో వారిద్దరూ కలిసి సినిమాలు చేయడంతో పాటు, విజయ్‌కు త్రిష సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని దర్శనమివ్వడంతో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ బాగానే టాక్ నడిచింది. త్రిష కారణంగానే విజయ్‌కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లుగా, వారిద్దరూ విడాకులు సైతం తీసుకోబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా సైతం కోడై కూసింది. అందుకే విజయ్ ఏ పొలిటికల్ మీటింగ్ పెట్టినా, ఫ్యామిలీకి సంబంధించి, ముఖ్యంగా ఆయన భార్య ఎక్కడా కనిపించలేదంటూ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి త్రిష చేసిన ఆసక్తికర కామెంట్స్.. వారిద్దరూ మరోసారి వార్తలలో నిలిపాయి.
Also Read- Allu Aravind: అల్లు అరవింద్ ఇంట మరో విషాదకర వార్త..
విజయ్ అందుకు అర్హుడు
అసలింతకీ త్రిష ఏమని కామెంట్స్ (Trisha Comments on Vijay Party) చేసిందని అనుకుంటున్నారా? ఇటీవల దుబాయ్ వేదికగా ‘సైమా-2025’ (SIIMA 2025) వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు త్రిష హాజరైంది. అక్కడ కొందరు హీరోల ఫొటోలు చూపించి, వారి గురించి చెప్పాలని త్రిషను హోస్ట్‌లు అడిగారు. అందులో విజయ్ ఫొటో రాగానే త్రిష ముసిముసిగా నవ్వింది. ఒక్కసారిగా అందరూ విజయ్.. అని అరుస్తుండటంతో త్రిష ముఖం ఆనందంతో వెలిగిపోవడమే కాకుండా.. చిరునవ్వును చిందిస్తూ.. సిగ్గుపడటం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. విజయ్ డ్రీమ్స్ అన్నీ ఫుల్ ఫిల్ అవ్వాలి. ఆయన కొత్త జర్నీకి గుడ్ లక్. విజయ్ అందుకు అర్హుడు.. అంటూ విజయ్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఎంట్రీపై త్రిష చెప్పుకొచ్చింది. దీంతో అందరూ ఏదో తేడాగా ఉందేంటి? అంటే, కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు నిజమేనా? విజయ్‌ని పెళ్లి చేసుకుంటుందా? లేక, ఆయన పార్టీలో చేరుతుందా? అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త పార్టీ పెట్టి మరీ..
ఇళయ దళపతి విజయ్ ఇటీవల ‘తమిళగ కళగం వెట్రి’ (Tamilaga Vettri Kazhagam) పేరుతో నూతన రాజకీయా పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు, ఎంతగానో శ్రమిస్తున్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన విజయ్, ఇప్పటికే రెండు బహిరంగ సభలను సైతం నిర్వహించి, తన స్టాండ్ ఏంటో చెప్పారు. విజయ్ పార్టీకి తమిళ సెలబ్రిటీల నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. ఇప్పుడు త్రిష కూడా ఈ పార్టీపై పాజిటివ్‌గా కామెంట్స్ చేయడంతో.. ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనేలా అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్‌తో ప్రేమ వ్యవహారంపై అటు విజయ్, ఇటు త్రిష.. ఇద్దరూ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘స్టాలిన్’ తర్వాత మరోసారి చిరుతో ఆమె జతకడుతోంది. తమిళ్‌లో సూర్య హీరోగా చేస్తున్న ‘కరుప్పు’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.
#Trisha about #ThalapathyVijay
– Good luck on his new journey. Whatever his dream is, it will come true because he deserves it.#Leo #JanaNayagan pic.twitter.com/rtrnYq1A2h— Movie Tamil (@_MovieTamil) September 7, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు