Youtuber Arrested: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రంలో పవిత్రతకు భంగం వాటిల్లేలా ఎవరు పాల్పడినా టిటిడి చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పలుమార్లు రీల్స్ చేయడంలోనూ, ఇతర అంశాలపై టీటీడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించేలా ఎవరైనా ఫేక్ వార్తలు సృష్టిస్తే వారిపై సైతం చర్యలు తప్పవని టీటీడీ ఇదివరకే హెచ్చరికలు సైతం జారీ చేసింది. తాజాగా ఓ యూట్యూబర్ నిబంధనలను ఉల్లంఘించి నడుచుకోవడంతో ఏకంగా టిటిడి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల క్షేత్రానికి వెళ్తున్నారా.. అయితే అక్కడి నిబంధనలు తప్పక తెలుసుకోవాల్సిందే. ఇష్టారీతిన రీల్స్ చేయడం, డ్రోన్లు ఎగురవేయడం వంటి చర్యలకు పాల్పడితే టిటిడి కఠిన చర్యలు తీసుకోనుంది. అటువంటి చర్యలకు పాల్పడిన ఓ యూట్యూబర్ ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందుకే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఎవరైనా ప్రవర్తిస్తే టీటీడీ నిఘా కన్నుల నుండి తప్పించుకోవడం కష్టమే. శ్రీవారి సన్నిధిలో గోవిందా నామస్మరణ సాగిస్తూ భక్తితో తమ భక్తిని చాటుకుంటున్న భక్తులకు ఆటంకం కలిగేలా ఎవరైనా ప్రవర్తించినా వారిపై చర్యలు తప్పవు. ఇక యూట్యూబర్ ను అరెస్టు చేసిన విషయంలోకి వెళితే..
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే ఓ యూట్యూబర్ మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసి నట్లు టిటిడి విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mahabubabd News: ఒక్క లెటర్ తో షాకిచ్చిన పిల్లలు.. అవాక్కైన తల్లిదండ్రులు..
అందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని పలుమార్లు టీటీడీ హెచ్చరించింది. కానీ ఇలాంటి చర్యలు మాత్రం ఆగడం లేదు. అందుకే టీటీడీ కూడా సీరియస్ యాక్షన్ లోకి దిగిందని చెప్పవచ్చు. అందుకే తిరుమలకు వెళ్లిన సమయంలో అక్కడి నిబంధనలు ఏ టీటీడీ ఉద్యోగిని అడిగినా మనకు తెలుస్తాయి. అలా నిబంధనలు తెలుసుకొని ప్రవర్తిస్తే, ఇలాంటి చిక్కులు రావని చెప్పవచ్చు.