TTD Update (image credit:TTD)
తిరుపతి

TTD Update: టీటీడీ ట్రస్ట్‌లకు భారీ విరాళాలు.. అంతా కోట్లల్లోనే..

TTD Update: కలియుగ దైవంగా కొలువై ఉన్న శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాలనే కాకుండా, దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గాన్ని ఎంచుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దైవ సన్నిధికి కాలినడకన చేరుకోవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తిరుమల వెంకన్న భక్తులకు ప్రసాదంగా అందించే పవిత్రమైన లడ్డూ రుచి చూసినా చాలు కదా అనే భావించేవారు అధికం. అయితే ఇటీవల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చే విరాళాల్లో కూడా విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన తొమ్మిది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ కు భారీగా విరాళాలు వచ్చాయి.

టీటీడీ ట్రస్ట్‌కు భారీగా పెరిగిన విరాళాలు
తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన వివిధ ట్రస్ట్‌లకు భక్తుల నుంచి విరాళాల ప్రవాహం భారీగా కొనసాగుతోంది. గడిచిన తొమ్మిది రోజుల్లోనే రూ. 26.85 కోట్ల విరాళాలు అందాయి. భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఈ విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ విరాళాలలో అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ. 11.67 కోట్లు సమకూరాయి భక్తుల సేవా కార్యక్రమాల్లో ప్రాముఖ్యతను చాటుకుంటూ, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 6.14 కోట్ల విరాళాలు అందాయి. అలాగే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ. 4.88 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

రూ. కోటి విరాళం
తాజాగా టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు కూడా మరొక ఉదారదాత భారీ విరాళాన్ని అందించారు. రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు దంపతులు రూ. 1.01 కోట్ల విరాళాన్ని అందజేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో భాగంగా వారు ఈ విరాళాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి చేతుల మీదుగా ఆలయంలో డీడీ రూపంలో అందజేశారు. దాత కుటుంబాన్ని టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నున్న తిరుమలరావు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Also Read: Lady Aghori: పవన్ కళ్యాణ్ ఎంటర్? లేడీ అఘోరీకి బిగ్ షాక్?

టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలు అందించడానికి భక్తులు ఆసక్తి చూపుతుండటం విశేషం. విద్యాదానం, అన్నప్రసాదం, వైద్యసేవలు, ఆలయ నిర్మాణం వంటి వివిధ పథకాల ద్వారా టీటీడీ భక్తులకు విశేష సేవలందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు వీలుగా భక్తుల సహకారం అత్యంత కీలకంగా మారిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, ఈవో గా శ్యామలరావుల సారథ్యంలో శ్రీవారి భక్తుల కోసం ఎన్నో కొత్త నిర్ణయాలను తీసుకున్నారు. సామాన్య భక్తులకు ఏ ఆటంకం కలగకుండా టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది