Tirumala News ( image credit:Twitter)
తిరుపతి

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి రద్దీ సమాచారం.. మీచేతిలోనే..

Tirumala News: త్వరలోనే తిరుమల శ్రీవారికి, భక్తులకు మధ్య ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) కీలక అనుసంధానకర్తగా వ్యవహరించబోతోంది. దర్శనాలు, వసతులు మొదలుకొని, వివిధ రకాల సేవలు, ఏ సమయంలో శ్రీవారి దర్శనం, ఏ సీజన్‌లో రద్దీ ఎక్కువ, దర్శన విధివిధానాలు, వస్త్రధారణ, పాటించాల్సిన నియమాలు వంటి సమగ్ర సమాచారాన్ని భక్తులు ఏఐ సాయంతో సులభంగా తెలుసుకోవచ్చు. కౌంటర్లు, ఎంక్వైరీ కేంద్రాల వద్దకు వెళ్లకుండానే భక్తుల సెల్‌ఫోన్లకే నోటిఫికేషన్లు వస్తాయి. అది కూడా వారివారి స్థానిక భాషల్లోనే సమాచారం అందనుంది.

శ్రీవారి దర్శనాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు తోడ్పాటు అందించనున్న ఏఐ సాయం కోసం గ్లోబల్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మధ్య త్వరలోనే కీలక ఒప్పందం జరగబోతోంది. మరో, వారం పది రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ మేరకు సన్నద్ధమవుతున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం వెల్లడించారు. తిరుమలలో సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు ప్రకారం గూగుల్‌తో ఒప్పందానికి కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

ఏఐని ఉపయోగించి తక్కువ సమయంలో దర్శనం, గదుల కేటాయింపు చేయించడం తమ లక్ష్యమని చెప్పారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా అధ్యయనం చేసి ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని, వాటిని సరిదిద్దుతామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసే ఏఐ కెమెరాల సాయంతో అనుమానితులు, నిందిత వ్యక్తుల సంచారాన్ని కూడా గుర్తించే వీలుంటుంది. ఈ సమారాన్ని పోలీసులు, విజిలెన్స్‌ అధికారులకు అందుంతుంది. ఏఐ టెక్నాలజీతో దళారులకు కూడా చెక్ పెట్టవచ్చునని, శ్రీవారి దర్శనం పేరిట మోసాలు కూడా తగ్గుతాయని అంచనాగా ఉంది.

సులభంగా రద్దీ సమాచారం
తిరుమలలో గూగుల్‌ ఏఐ టెక్నాలజీ సేవలు అందుబాటులో వస్తే భక్తులు మరింత సులభంగా, త్వరితగతిన శ్రీవారిని దర్శించుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ వినియోగంలో భాగంగా ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక ఐడీ నంబర్ ఇవ్వనున్నారు. ఆ ఐడీ నంబర్ ద్వారా భక్తులు భవిష్యత్‌లో దర్శనంతో పాటు ఇతర సేవలు, రూమ్స్ బుకింగ్‌ సులభంగా చేసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీకి సంబంధించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

గదులకు సంబంధించి సెంట్రల్ ఎంక్వైరీ ఆఫీస్, హెల్త్ సెంటర్లు, అన్న ప్రసాద కేంద్రం, కల్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరినీ అడగకుండానే సామాన్య భక్తులు ఫోన్‌ ద్వారానే ఇన్ఫర్మేషన్‌ను పొందవచ్చు. ఫోన్లకే నోటిఫికేషన్లు రానునున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని దేవాలయాల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కానీ, సమాచారం పరిమితమైంది. అయితే, టీటీడీ దర్శనాలతో పాటు వసతి, వివిధ సేవల కోసం ఏఐ సాంకేతికతను ఉపయోగించనుంది.

తద్వారా ఏ టైమ్‌లో, ఏ సీజన్‌లో భక్తులు ఎక్కువగా వస్తున్నారు, తదనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి పెట్టేందుకు టీటీడీకి దోహదపడనుంది. తద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం దక్కుతుంది. దర్శన క్యూలైన్ల నియంత్రించడంతో పాటు భక్తులు షెడ్లలో ఎక్కువ సమయం వేచిచూడకుండా ఈ టెక్నాలజీ దోహదపడుతుందని అంచనాగా ఉంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉన్నా నియంత్రణ చర్యలను అధికారులు వేగంగా చేపట్టే అవకాశం ఉంది.

Also Read: Ugadi 2025: ఉగాది రోజు ఉపవాసం.. ఫలితం అమాంతం.. విధానం ఇదే!

7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం
తిరుమలలో ఏప్రిల్‌ నెలలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్న విశేష పర్వదినాలను టీటీడీ శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 6- శ్రీరామ నవమి ఆస్థానం, ఏప్రిల్ 7- శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం, ఏప్రిల్ 8- సర్వ ఏకాదశి, ఏప్రిల్ 10 నుంచి 12 వరకు వసంతోత్సవాలు, ఏప్రిల్ 12- చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి, ఏప్రిల్ 23- భాష్యకార్ల ఉత్సవారంభం, ఏప్రిల్ 24- మతత్రయ ఏకాదశి, ఏప్రిల్ 30- పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయలను నిర్వహించనున్నట్టు పేర్కొంది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం