Ugadi 2025: ఉగాది రోజు ఉపవాసం.. ఫలితం అమాంతం.. విధానం ఇదే!
Ugadi 2025 (image credit:Canva)
Editorial

Ugadi 2025: ఉగాది రోజు ఉపవాసం.. ఫలితం అమాంతం.. విధానం ఇదే!

Ugadi 2025: ఉగాది పర్వదినం రానే వస్తోంది. మన తెలుగువారి పండగల్లో గల మరో గొప్ప పండుగ. ఉగాది అంటే ఆ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఉగాది రోజు ఉపవాసం ఆచరిస్తారని మీకు తెలుసా? అసలు ఉపవాసం ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే, తప్పక మీరు ఆచరిస్తారు. చాలా వరకు ఉగాది ఉపవాసం ఎలా ఆచరించాలో తెలియని వారు ఉంటారు. అందుకే ఈ ప్రత్యేక కథనం.

హిందూ సాంప్రదాయాలకు, పండుగలకు ప్రపంచమే తలదించుతుంది. అందుకు ప్రధాన కారణం, మన సాంప్రదాయాలు ఆనందంతో పాటు మనలో భక్తితత్వాన్ని, మానవత్వాన్ని తట్టిలేపుతాయి. అందుకే కాబోలు విదేశీయులు కూడా మన పండుగలు ఆచరించే స్థాయి మనది. అలాంటి పండగలలో ఉగాది ఇకటి. ఉగాది అంటే తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే రోజుగా మనం గుర్తిస్తాం.

ఆంగ్లనామ సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రారంభమైనా, తెలుగు సంవత్సరం లెక్కలు ఉగాది నుండే ప్రారంభం అవుతాయి. అందుకే ఈ పండుగ మనకు చాలా ప్రత్యేకం. ఉగాది పండుగ గురించి మొట్ట మొదటగా మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది పచ్చడి అని చెప్పడం కంటే, మనకు ఎన్నో నీతిబోధలు అందించే వంటకం అని చెప్పవచ్చు.

మొత్తం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినకుండా, పండుగ ముగింపు జరగదు. అందుకే కాబోలు ఉగాది రోజు ఎవరి ఇంటికి వెళ్లినా, ముందుగా పచ్చడి తప్పక మనకు అందిస్తారు. అలాగే పంచాంగ శ్రవణం సాగుతుంది. ఇలా సాగే ఉగాది పండుగ రోజు ఉపవాసం ఆచరిస్తే కలిగే ప్రయోజనం ఊహించలేము అంటుంటారు వేద పండితులు. ఇంతకు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.

ఉగాది ఉపవాసం ప్రాధాన్యత
ఉగాది రోజున కొంతమంది భక్తులు ఉపవాసాన్ని ఆచరిస్తారు. దీనితో మనలో ఆధ్యాత్మిక శుద్ధి, ఇంద్రియ నియంత్రణ సాధ్యమవుతుందట. ఉపవాసంతో మనస్సు, శరీరాన్ని శుద్ధి చేస్తూ, దేవుడి పట్ల భక్తి కలిగి మనకు అంతా మంచే జరుగుతుంది. అందుకే ఉపవాసం ఆచరించండి.. దైవానుగ్రహం పొందండి.

ఆచరించే విధానం..
ఉదయం స్నానమాచరించి, దేవుడికి పూజ చేసి, పచ్చడిని నైవేద్యంగా సమర్పించిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటారు. మరికొందరు పూజ చేసి, పచ్చడి స్వీకరించి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. కొందరు నీళ్లు మాత్రమే తాగుతూ ఉపవాసం చేస్తారు. మరికొందరు పళ్ళు, పాలు తీసుకుంటూ తేలికపాటి ఉపవాసం చేస్తారు. కొన్ని కుటుంబాల్లో నూనె పదార్థాలు, మసాలాలు లేకుండా వంటకాలను తీసుకుంటారు.

Also Read: OTT Movies: ఈ వీకెండ్ చాలా స్పెషల్.. ఓటీటీలోకి 4 క్రేజీ చిత్రాలు!

కొంతమంది ఉపవాసాన్ని విరమించే ముందు పంచాంగ శ్రవణం వింటారు. ఉపవాసం ముగిసిన తర్వాత ఉగాది పచ్చడి, పులిహోర, బొబ్బట్లు వంటి సాంప్రదాయ వంటకాలను ఆహారంగా తీసుకుంటారు. ఇలా ఉపవాసం ఆచరించి స్వామి వారి పట్ల భక్తిని చాటుకోవడం ద్వారా ఏడాది పాటు దైవానుగ్రహంతో కష్టాలు దరిచేరవని భక్తుల నమ్మకం. మరెందుకు ఆలస్యం.. 30 వ తేదీ ఉగాది పర్వదినం.. ఉపవాసం ఆచరించండి.. దైవానుగ్రహం పొందండి.

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..